కరోనా యుద్ధం-కవి హృదయం

యుధ్దం

భూమి నిర్మానుష్యమైంది
దిక్కులు నల్లబడ్డాయి
జీవకోటి సంచారం లేక

కాలగర్భంలో కలిసిపోయిన
అనేక వత్సరాల చరితలో
ఇదో….. ప్రత్యేకం..

ఆయుధం పట్టలేదు
రసాయనం చల్లలేదు
ఇది కేవలం
తుంపర యుద్దం
ముట్టుకుంటే భస్మం
సాంకేతికత నింగిని తాకినా
సాయపడని సందిగ్దావస్థ
స్వార్దం వికృత రూపం దాల్చితే
వినాశనం విశ్వమంతా విహరిస్తోంది

మానవ తప్పిదం
మనుగడనే దగ్దం చేస్తూ
ముందుచూపు లేని పరిపాలన
మత్తులో జోగుతోంది
ధన దాహం
బతుకు భయాన్ని తీర్చలేదు
కులం, మతం
మెతుకు పండించలేదు

ప్రకృతి ఒక శక్తి
ప్రకృతి ఒక యుక్తి
దాన్ని జయించాలని,
గుప్పిట పట్టాలని
తలంచకు
మేలుకో
బతుకు దారి సవ్యంగా పేర్చుకో
విచక్షణ
విజ్ఞానాన్ని, వికాసాన్ని ఇస్తుంది
అయినా
ఇంతటి వైపరిత్యంలోనూ
ప్రకృతి పరవశిస్తోంది
కాలకూట కాలుష్యం
అడుగంటి
స్వచ్చత చిగురిస్తుంది …

“”మహి”” 08.04.2020
(వనమాలి కల్చరల్ సొసైటీ) Mobile : +91 90106 46492