పెళ్లెప్పుడో హింట్ ఇచ్చిన కెవ్వుకేక బ్యూటీ…

బాలీవుడ్ హాట్ ఐటమ్ గర్ల్ మలైకా అరోరా తన రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. తన 12 ఏళ్ళు చిన్నోడైన యంగ్ హీరో అర్జున్ కపూర్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న మలైకా ఎట్టకేలకు పెళ్లి చేసుకునే ఉద్ద్యేశం ఉందంటూ చెప్పుకొచ్చింది.

తాజా చిట్ చాట్ లో పెళ్లిపై, పిల్లలపై ఈమేరకు క్లారిటీ ఇచ్చింది. పరిస్తితులు అనుకూలిస్తే నిర్ణయాన్ని ప్రకటిస్తామని నర్మగర్భంగా తన మనసులోని మాటని బయపెట్టింది. ప్రస్తుతం పర్సనల్ గా, ప్రొఫెషనల్ గా చాలా సంతోషంగా ఉన్నానని, సీక్రెట్ గా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదంటూనే అందరికి చెప్పే పెళ్లి చేసుకుంటానని మలైకా చెప్తోంది.