త‌న గోత్రం గురించి తొలిసారి చెప్పిన మ‌మ‌తా బెన‌ర్జీ

త‌న గోత్రం గురించి తొలిసారి చెప్పిన మ‌మ‌తా బెన‌ర్జీ

ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో వీల్‌చైర్‌ పైనే కూర్చొని ప్ర‌చారం చేస్తోన్న‌‌ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ తొలిసారి త‌న గోత్రం ఏంట‌నే విష‌యాన్ని ప్ర‌జ‌ల‌కు చెప్పారు. నందిగ్రామ్‌లో ఆమె ప్ర‌చార కార్య‌క్ర‌మాలు ముగిశాయి. ఈ సంద‌ర్భగా ఆమె మాట్లాడుతూ.. తన‌ది బ్రా‌హ్మ‌ణ వ‌ర్గానికి చెందిన శాండిల్య గోత్రమ‌ని చెప్పారు.గ‌తంలో ఆమె ఎప్పుడూ త‌న‌ది ఏ గోత్రం అన్న విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టలేదు. తాను ఆల‌యాల‌కు వెళ్తే పూజారులు త‌న గోత్రం అడిగార‌ని, అయితే, ఆ స‌మ‌యాల్లో తాను మా మాతి మ‌నుష్ అని తాను చెప్పిన‌ట్లు మ‌మ‌తా బెన‌ర్జీ గ‌తంలో చెప్పారు. అయితే, ఈ సారి ఆమె స్వ‌యంగా త‌న గోత్రం గురించి చెప్ప‌డం గ‌మ‌నార్హం.