కరోనా యుద్ధంలో మనిషే గెలుస్తాడు

కరోనా కష్ట కాలంలో భారాయతీయులు అందరూ మానవత్వం ప్రదర్శించారు. ప్రధానమంత్రి హోదాలో రోజు నేను చాలా దేశాల అధిపతులతో ఫోన్లో మాట్లాడినప్పుడు, వారు భారత ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఆ ప్రజలు ‘థాంక్యూ ఇండియా, థాంక్స్ పీపుల్ ఆఫ్ ఇండియా’ అని చెప్పినప్పుడు, దేశానికి గర్వం పెరుగుతుంది. అదేవిధంగా, భారతదేశ ప్రజలు ఆయుర్వేదం, యోగాకు ఇచ్చే ప్రాముఖ్యతను ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రత్యేకమైన రీతిలో చూస్తున్నారు.

సోషల్ మీడియాలో చూడండి, ప్రతిచోటా రోగనిరోధక శక్తిని ఎలా పెంచుకోవాలి, ఆయుర్వేదం, భారతదేశ యోగా ఎలా చర్చించబడుతున్నాయి. కరోనా దృష్టి కోణంలో, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ ఇచ్చిన సందేశాన్ని, మీరు ఖచ్చితంగా ఉపయోగిస్తున్నారని నేను విశ్వసిస్తున్నాను. ఆయుష్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన వేడి నీరు, కషాయాలను, ఇతర మార్గదర్శకాలను మీరు మీ దినచర్యలో చేర్చుకుంటే చాలా ప్రయోజనం ఉంటుందని ప్రధానమంత్రి మనస్సులో మాటలో అన్నారు. ఏదేమైనా ఎప్పటికైనా ఈ భూమిపై మనిషి గెలుపు మాత్రమే తధ్యం. కరోనా మహామ్మారి ఎంత భయపెట్టిన చివరికి మానవుని చేతిలో ఓడిపోవాల్సిందే..