కోహ్లీ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు

కోహ్లీ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు

టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్నాడు. ఆయనకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. టాలీవుడ్ హీరో మహేశ్ బాబు కూడా కోహ్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ తన ఫేవరెట్ క్రికెటర్లలో ఆయన ఒకడని చెప్పాడు.‘నా అభిమాన క్రికెట‌ర్లలో ఒక‌రైన విరాట్ కోహ్లీకు బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు. నువ్వు మరెన్నో రికార్డులు సృష్టిస్తూ దేశం గ‌ర్వించేలా చేయాలి’ అని మహేశ్ అన్నాడు‌. కాగా, ప్రస్తుతం మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. కోహ్లీకి హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ‘హ్యాపీ బర్త్ డే’ చెప్పింది.కోహ్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ రవిశాస్త్రి, వీవీఎస్ లక్ష్మణ్, అనిల్ కుంబ్లే, యువరాజ్ సింగ్, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్ వంటి క్రికెటర్లు ట్వీట్లు చేశారు.