RED జోన్లలో మార్చ్ పాస్ట్

విజయవాడ నగరంలోని రెడ్ జోన్ ప్రాంతాలలో సీపీ ద్వారకా తిరుమల రావు, కలెక్టర్ ఇంతియాజ్ పర్యటించారు. మీసాల రాజేశ్వరరావు వంతెన నుండి ఖుద్దూస్ నగర్ రెడ్ జోన్ లో పోలిస్ వాహనాలతో మార్చ్ పాస్ట్ నిర్వహించారు. పోలీస్ మార్చును జెండా ఊపి సీపీ, కలెక్టర్ ప్రారంభించారు.

సీపీ ద్వారకా తిరుమల రావు కామెంట్స్ 

విజయవాడ కమిషనరేట్ పరిధిలో 200 పైగా పోసిటివ్ కేసులు నమోదయ్యాయి. రెడ్ జోన్ ప్రాంత ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నాం, ప్రజలు బయటకి రావొద్దు. విధి నిర్వహణలో భాగంగా ఎంతో మందికి కరోన సోకింది. నగరంలో బాధ్యతారహితంగా ఉన్న వారికి కరోన వచ్చింది. ఇప్పటికే 13 మంది పోలీస్లకు,12మంది వాలంటీర్స్ కి కరోన వచ్చింది. విజయవాడలో కరోనా కేసులు బాగా మెరుగవుతున్నాయి. ఎవరూ బయటకు రాకూడదు. ఇష్టం వచ్చినట్లు వస్తే ఊరుకోం, కరోనా కేసులు పెరిగే కొద్దీ పోలీసుల చర్యలు తీవ్రంగా ఉంటాయి. Apsdrf బృందాలను కూడా రంగంలోకి దించాము. లాక్ డౌన్ నిబంధనలు పాడించాలి అతిక్రమణ చేస్తే చర్యలు ఉంటాయి. రెడ్ జోన్ ప్రాంతంలో డ్రోన్ల సహయంతో కదలికలు పర్యవేక్షిస్తున్నాం.

కలెక్టర్ ఇంతియాజ్ కామెంట్స్

విజయవాడ లో కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి. మేము చర్యలను తీసుకున్నా, ప్రజలు జాగ్రత్తలు పాటించడం లేదు. కృష్ణలంక, కార్మిక నగర్, ఖుద్దూస్ నగర్ ప్రాంతాలలో కేసులు ఎక్కువుగా వచ్చాయి. ఈ ప్రాంతాలలో సామూహిక సమావేశాలు పెట్టడం వల్లే కరోనా వ్యాప్తి, ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి స్వీయ నియంత్రణ పాటించాలి, అతిక్రమణ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.