కరోనాలోనే భజంత్రీలు మోగాయి…

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం తడ్కల్ క్లస్టర్ ఏఈఓగా ఉద్యోగం చేస్తోన్న సంతోష్ వివాహానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ హాజరయ్యారు. వివాహ మండపంలోనే 2 లక్షలు కరోనా చికిత్సకు ఉపయోగించాలని ముఖ్యమంత్రి సహాయనిధికి ఈ నూతన వధూవరులు అందజేశారు.

ఆదివారం కంగ్టిలో వివాహం జరిగింది. ఈ వధూవరుల నిర్ణయం యువతకు స్ఫూర్థిదాయకం నిలుస్తుందని మంత్రి అన్నారు. కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు శ్రమిస్తున్న అందరు ఉద్యోగులలో అతని చర్య ఉత్సాహాన్ని నింపుతుంది కరోనా విపత్తులో కూడా రైతాంగం నష్టపోకుండా గ్రామగ్రామాన పంటలు కొనుగోలు చేస్తున్న వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ఉద్యోగిగా సంతోష్ అందరికీ ఆదర్శమయ్యాడు. సాధారణ ఉద్యోగి అయినా అసాధారణంగా స్పందించాడని కొనియాడారు.