మే4 తర్వాత గణనీయ సడలింపులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

దేశంలో లాక్ డౌన్ పరిస్థితిపై కేంద్ర హోంశాఖ సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించింది. లాక్ డౌన్ వల్ల ఈ రోజు వరకు పరిస్థితిలో అద్భుతమైన ప్రయోజనం, మెరుగుదల గుర్తించడం జరిగింది. లాక్ డౌన్ వల్ల ఇంత వరకు కలిగిన ప్రయోజనాలు దూరం కాకుండా ఉండాలంటే, మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలుచేయాలి. కోవిడ్-19 పై పోరుకు కొత్త మార్గదర్శకాలు మే 4వ తేదీ నుండి అమలులోకి వస్తాయి. వీటిలో చాలా జిల్లాలకు గణనీయమైన సడలింపులు ఉన్నాయి. వీటి గురించిన వివరాలు రానున్న రోజుల్లో తెలియజేయడం జరుగుతుంది.