పిల్లల్లో పౌష్ఠికాహార లోపాన్ని తగ్గించే చర్యలు

పిల్లల్లో పౌష్ఠికాహార లోపం, ఎదుగుదల ఆగిపోవటం, తక్కువ బరువుండటం లాంటి అంశాలమీద ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ పరిధిలోని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందజేస్తూ ఉంటుంది.

పిల్లల్లో పౌష్ఠికాహార లోపాన్నిసవరించటానికి ప్రభుత్వం అంగన్వాడీ పథకం. ఎదుగుతున్న బాలికల కోసం ఒక పథకం, ప్రధానమంత్రి మాతృ వందన యోజన లాంటి పథకాలను సమీకృత శిశు అభివృద్ధి సేవలలో భాగంగా నిర్వహిస్తున్నారు. 2018 మార్చి 8 న ప్రారంభించిన పోషణ్ అభియాన్ లక్ష్యం దేశంలో పౌష్టికాహార లోపాన్ని దశలవారీగా తగ్గించటం.

ప్రభుత్వం కూడా పుష్ఠికరమైన ఆహారాన్ని అందించటం మీద, వాటి ఫలితాలమీద దృష్టిపెడుతోంది. ఆరోగ్యం, శ్రేయస్సు, రోగనిరోధకశక్తి పెంచేలా పోషణ్ 2.0 పేరితో ఒక సమీకృత పౌష్టికాహార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీన్ని 2021-2022 బడ్జెట్ లో ప్రకటించింది. పౌష్టికాహార నాణ్యతను, పంపిణీ వ్యవస్థను మెరుగుపరచేందుకు టెక్నాలజీ సాయం తీసుకుంటూ ఆ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తోంది. దీనివలన ఎప్పటికప్పుడు సమాచారం అందుతుంది. ఆకనుబంధ ఆహారంలో పోషకాలు ఆహార భద్రత, ప్రమాణాల చట్టానికి అనుగుణంగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. పౌష్టికాహార లోపం సంబంధిత వ్యాధులను నివారించటానికి ఆయుష్ విధానాలను అవలంబించాలని కూడా రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది.

అంగన్వాడీ కేంద్రాలలో పోషణ్ వాటికలు అభివృద్ధి చేసేందుకు ఒక కార్యక్రమాన్ని రూపొందించటం ద్వారా ఆహారంలో సంప్రదాయ విధానాలలోని వైవిధ్యాన్ని కూడా వాడుకునే ఏర్పాటు జరిగింది. ఇందులో పారాదర్శకటకు, జవాబుదారీతనానికీ పెద్దపీట వేస్తూ పంపిణీ సజావుగా జరిగేందుకు, ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా 2021 జనవరి 13 న మార్గదర్శకాలను జారీచేశారు.

కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి జూబిన్ ఇరానీ ఈ మేరకు రాజ్యసభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో వెల్లడించారు.