కరోనాపై మీడియా కూడా అలర్ట్

కరోనాపై మీడియా కూడా అలర్ట్

హైదరాబాద్ టైమ్స్ ఆఫ్ ఇండియా యాజమాన్యం రిపోర్టర్లకు సోమవారం నుంచి వర్క్ ఫ్రమ్ హోం అనుమతి ఇచ్చింది. రిపోర్టర్లు, మార్కెటింగ్ ఉద్యోగులు, ఫీల్డ్ లో తిరిగే ఇతర ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం వెసులుబాటు ఇచ్చిన జాబితాలో ప్రముఖ జాతీయ ఆంగ్ల దిన పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా చేరింది. హైదరాబాద్ తో సహా ఢిల్లీ, ముంబై నగరాల్లోని టైమ్స్ ఆఫ్ ఇండియా ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
వివిధ చోట్ల తిరిగే రిపోర్టర్లు, మార్కెటింగ్ సిబ్బంది కరోనా
ట్రాన్స్ మీటర్లుగా మారే ప్రమాదం ఉన్న నేపథ్యంలో
ఈ నిర్ణయం ప్రకటించారు.