మెగాస్టార్ ఫ్యామిలీ ఫైట్ విత్ కరోనా సాంగ్ హల్ చల్

సినీ పరిశ్రమకు ప్రేక్షకులు దేవుళ్ళు. ప్రేక్షకులు లేకుంటే సినిమా లేదు. నటీనటులే కాదు ఆ పరిశ్రమ మీద ఆధారపడిన వారి పరిస్థితి అగమ్యగోచరమే. ఈ నేపథ్యలో టాలీవుడ్ స్టార్లలో మానవత్వం పరిమళించిoది. ఓ వైపు విరాళాలు అందజేస్తూ నే మరో వైపు కరోనా నుంచి కాపాడడానికి ప్రజా చైతన్య కార్యక్రమాలు చేపట్టారు మన స్టార్స్. లాక్ డౌన్ లో బయటికి రాకుండా ఇళ్లలోనే ఉండాలంటూ ‘ పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు సామాజిక మాధ్యమాల ద్వారా తమదైన రీతిలో ప్రజలకు జాగ్రత్తలు తెలియజేస్తున్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు చెబుతూ సంగీత దర్శకుడు కోటి ట్యూన్ చేసిన పాటకు విశేష స్పందన లభిస్తోంది. కోటి పాటకు చిరంజీవి.. నాగార్జున.. వరుణ్ తేజ్ ఇంకా సాయి ధరమ్ తేజ్ లు వారి వారి ఇంట్లో ఉండి కవర్ వీడియోను చేశారు. ఈ అయిదుగురి విజువల్స్ ను ఆకర్షనీయంగా ఎడిట్ చేసి పాటగా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కరోనాతో జాగ్రత్తగా ఉందా.. ముందస్తు చర్యగా ఇంట్లోనే ఉండటంతో పాటు చేతులు విధిగా కడుక్కుంటూ పరిశుభ్రతను పాటిద్దాం అంటూ పాట సాగింది.

‘వి గోనా ఫైట్ విత్ కరోనా’.. అంటూ సాగిన ఈ పాటతో వచ్చిన మెగాస్టార్ చిరంజీవి నాగార్జున ఇంకా ఇతర స్టార్స్ ను నెటిజన్స్ అభినందిస్తున్నారు. ఈ సమయంలో ప్రతి ఒక్కరి అవగాణ కోసం ఏదో ఒక మార్గంలో చెప్పేందుకు ప్రయత్నించాలి. ఇలా పాట రూపంలో జనాల్లోకి తీసుకు వెళ్లడం వల్ల ఎక్కువ మందికి మెసేజ్ చేరుతుందని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.