మెగా మేనల్లుడి మరో కొత్త సినిమా మొదలు

మెగా మేనల్లుడి మరో కొత్త సినిమా మొదలు

వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఉప్పెన’ సంచలన విజయాన్ని సాధించింది. భారీ వసూళ్లతో కొత్త రికార్డును సృష్టించింది. ఆ సినిమా ఇచ్చిన క్రేజ్ తో వైష్ణవ్ తేజ్ ను వెతుక్కుంటూ కొత్త ప్రాజెక్టులు చాలానే వచ్చాయి. అయితే వాటిలో ఆయన తనకి నచ్చిన కథలకి మాత్రమే ఓకే చెప్పాడు. ఆ ప్రాజెక్టులలో ఒకటి ఈ రోజు ఉదయం పూజా కార్యక్రమాలను జరుపుకుంది. కోవిడ్ పరిస్థితుల కారణంగా చాలా సింపుల్ గా ఈ పూజా కార్యక్రమాలను నిర్వహించారు.హీరో వైష్ణవ్ తేజ్ .. హీరోయిన్ కేతిక శర్మపై సాయితేజ్ క్లాప్ ఇచ్చాడు. వైష్ణవ్ తేజ్ తల్లి విజయదుర్గ కెమెరా స్విచ్చాన్ చేయగా ఈ సినిమా షూటింగు లాంఛనంగా మొదలైంది. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి, గిరీశాయ దర్శకత్వం వహిస్తున్నాడు.ఇంతకుముందు ఈ దర్శకుడు తమిళంలో విక్రమ్ తనయుడు ‘ధృవ్’ హీరోగా ‘ఆదిత్య వర్మ’ను తెరకెక్కించాడు. తెలుగులో భారీ విజయాన్ని సాధించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాకి అది రీమేక్. ఆ సినిమా అక్కడ ఫరవాలేదనిపించుకుంది. ఇక ‘రొమాంటిక్’ .. ‘లక్ష్య’ తరువాత కేతిక శర్మ ఈ సినిమా చేస్తోంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.