క్రికెట్ దేవుడికి మెగాస్టార్ శుభాకాంక్షలు…ఎందుకో??

క్రికెట్ చరిత్రలో “గాడ్ ఆఫ్ క్రికెట్” సచిన్ టెండూల్కర్ పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. క్రికెటర్ సచిన్ కు 47 ఏళ్ళు నిండాయి.

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తేజలు సచిన్ తోన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పోస్టులు చేశారు.
ఈ మాస్టర్ బ్లాస్టర్ కరోనా కారణంగా పుట్టినరోజును జరుపుకోకూడదని నిర్ణయించుకున్నారు. లిటిల్ మాస్టర్ సచిన్ కరోనా పోరాటంలో సైనికుల్లా వైద్యులు, నర్సులు, పోలీసులు, మున్సిపల్ సిబ్బంది అందరికి సెల్యూట్ చేస్తూ కలియుగ ప్రత్యక్ష దైవాలు మనకు పరమాత్ముడు ఇచ్చిన వరమన్నారు. ఈ చిచ్చర పిడుగుకు క్రికెటర్లు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.