సోషల్ మీడియాలోకి మెగాస్టార్ చిరంజీవి

సోషల్ మీడియాలోకి మెగాస్టార్ చిరంజీవి

గత కొన్నేళ్లుగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నాడు కానీ ఇప్పుడు యాక్టివ్ అయ్యేందుకు సిద్ధమయ్యారు. ఉగాది రోజు నుంచి మెగాస్టార్ సోషల్ మీడియాలోకి ఎంటర్ అవుతున్నానని ఓ వీడియోని అధికారికంగా విడుదల చేశాడు. ఈ వీడియోలో తన భావాలను అభిమానులతో పంచుకోవడం కోసం సోషల్ మీడియాలో రాబోతుండటంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కొణిదెల ప్రొడక్షన్స్
బ్యానర్ పై నిర్మిస్తున్నారు. దేశంలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తుండడంతో షూటింగ్ వాయిదా వేస్తున్నట్లు మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు.