చిరంజీవి సినిమాలో కాజ‌ల్

చిరంజీవి సినిమాలో కాజ‌ల్
కోటిన్నరకి ఓకే చెప్పిన కాజల్..!
త్వరలోనే షూటింగుకి హాజరు.

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల కాంబినేషన్లో వస్తోన్న ‘ఆచార్య’ సినిమా రూపొందిస్తున్నారు. వినోదానికి ఓ సందేశాన్ని మేళవించి కొరటాల సిద్ధం చేసుకున్న కథ ఇది. చిరంజీవిని కొత్త లుక్ తో ఆయన చూపిస్తారనడం అందరిలో ఆసక్తికరంగా మారింది. అలాగే ఈ సినిమాలో చరణ్ కూడా నటిస్తుండటం మరో ప్రత్యేక అంశంగా కనిపిస్తోంది.

కోటిన్నరకి ఓకే చెప్పిన కాజల్..!
ఈ నేపథ్యంలోనే కథానాయికగా ఎన్నికైన ‘త్రిష’ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. దాంతో ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాను దృష్టిలో పెట్టుకుని, కాజల్ అయితే బాగుంటుందని భావించి సంప్రదింపులు జరిపారట. అయితే పారితోషికంగా కాజ‌ల్ రెండున్నర కోట్లు అడిగింద‌నే ప్ర‌చారం నెల‌కొంది. అయితే చివరికి ఒకటిన్నర కోటికి చేయడానికి ఆమె అంగీకరించినట్టు సమాచారం. త్వరలోనే ఆమె షూటింగులో పాల్గొననున్నట్టు చెబుతున్నారు. మరోసారి తెరపై ఈ జంట ఏ రేంజ్ లో సందడి చేస్తుందో వేచి చూడాల్సిందే.