ట్వట్టర్ ఖాతాలోకి మెగా ఎంట్రీ

ట్వట్టర్ ఖాతాలోకి మెగా ఎంట్రీ

టాలీవుడ్ లెజెండ్ మెగాస్టార్‌ చిరంజీవి ఉగాది నాడు ట్విటర్‌లో ఖాతా తెరిచారు. శ్రీ శార్వరి నామ ఉగాది
పురస్కరించుకుని ఫస్ట్‌ ట్వీట్‌ చేశారు. ప్రజలందరికి శార్వరి నామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. నా సహచర భారతీయులు, అత్యంత ప్రియమైన అభిమానులతో
మాట్లాడగలగడం ఆనందంగా ఉందన్నారు.

2020లో ప్రపంచాన్ని పట్టిపీడిస్తోన్న మహామ్మారి కరోనా వైరస్ ను కలిసికట్టుగా ఎదుర్కొనేందుకు కంకణం కట్టుకుందాం.
గృహమే కదా స్వర్గ సీమ ఇంట్లోనే నివసిద్ధం, సురక్షితంగా ఉందాం. అని చిరంజీవి ట్వీట్‌ చేశారు. మెగాస్టార్‌ ట్విటర్‌లో
అడుగుపెట్టగానే ఫాలోవర్స్ దాదాపు 43 వేల మందికి చేరుకుంది.