మెగాస్టారే మన లెజెండ్ అంటున్న త్రిష

అదేంటి ఆయన సినిమా నుంచి తప్పుకున్న వర్షం పాపా ఇప్పుడేంటి లెజెండ్ అంటూ పొగుడుతుంది అనుకుంటున్నారా. అవును మీరు చదివిందే నిజమే. సౌత్ ఇండియా అగ్ర కథానాయికగా బోలెడు మంది అభిమానులను సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ త్రిష నిన్న పుట్టినరోజు జరుపుకుంది.

ఈ సందర్భంగా ఆమెకు పలువురు సినీ ప్రముఖులనుంచి శుభాకాంక్షలు లభించాయి. తనకు బర్త్ డే విషెస్ చెప్పిన వారందరికి త్రిష కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సందర్భంగా ఈ మధ్య సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్న మెగాస్టార్‌ చిరంజీవి త్రిషకి ‘జన్మదిన శుభాకాంక్షలు త్రిష నీ జీవితం సంతోషం, విజయంతో నిండిపోవాలని కోరుకుంటున్నా అన్నారు. ఈ ఏడాది నీకు గొప్పగా ఉండాలని ఆశిస్తున్నా’ అంటూ ట్వీట్‌ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. చిరు ట్విట్ కి ‘స్వీటెస్ట్‌ లెజెండ్‌ చిరంజీవికి ధన్యవాదాలు’త్రిష రిప్లై ఇచ్చారు.

త్రిష రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొదట చిరు కొరటాల శివల ఆచార్య లో హీరోయిన్ గా త్రిషనే ఎంపిక చేసారు. మణిరత్నం సినిమా ఛాన్స్ రావడంతో ఆచార్య నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన త్రిష పట్ల మెగాస్టార్ అభిమానులు గుర్రుగా ఉన్నారు.

మెగాస్టార్ సరసన ఇప్పటికే స్టాలిన్ మూవీలో నటించిన త్రిష మరోసారి అవకాశం వచ్చినా క్రియేటివ్ డిఫరెన్స్ పేరుతో సినిమా వదులుకోడం ఆ స్థానంలో అమ్మడు కాజల్ వచ్చి చేరింది. దసరాకి రిలీజ్ చేయాలని భావించినప్పటికీ లాక్ డౌన్ నేపథ్యంలో షూటింగ్ మరింత ఆలస్యం కానుంది. చిరు- కాజల్ జంటగా నటించే ఈ చిత్రంలో మెగాపవర్ స్టార్ రాంచరణ్ కీలకపాత్ర పోషించనున్నారు.