యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ విమాన గోపురం బంగారంతో నిర్మాణం కోసం మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ ఆరు కిలోల బంగారాన్ని విరాళంగా MEIL ప్ర‌క‌టించింది.

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ విమాన గోపురం బంగారంతో నిర్మాణం కోసం మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ ఆరు కిలోల బంగారాన్ని విరాళంగా MEIL ప్ర‌క‌టించింది.

తెలంగాణలోని ప్రతిష్ఠాత్మకమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ పునర్నిర్మాణం సందర్భంగా ముఖ్యమంత్రి KCR పిలుపు మేరకు ఆలయ విమాన గోపురానికి బంగారం తాపడం కోసం మేఘా ఇంజినీరింగ్ కంపెనీ ఆరు కిలోల బంగారం సమర్పిస్తున్నట్టు ప్రకటించింది.

ఈ సందర్భంగా MEIL డైరెక్టర్ బి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ గోపురానికి బంగారు తాపడం ఎంతో పుణ్యమైన కార్యక్రమమని, ఇందులో MEIL భాగస్వామవడం మాకు ఎంతో గౌరవప్రదమైన అవకాశమని తెలిపారు.

ఈ విషయానికి సంబంధించి త్వరలోనే ఆరు కేజీల బంగారం లేదా అందుకు సమానమైన మొత్తాన్ని చెక్కు రూపంలో అందజేస్తామని MEIL డైరెక్టర్ తెలిపారు. తెలంగాణలో ఎంతో ప్రతిష్ఠాత్మక పుణ్యస్థలమైన యాదాద్రి ఆలయం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనాత్మక రూపకల్పనలో మరింత అందంగా రూపుదిద్దుకుని, దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా మారుతుందని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.