కరోనా కట్టడి కోసం MEIL దాతృత్వం

కరోనా కట్టడి కోసం MEIL దాతృత్వం

కరోనా వైరస్ మహామ్మారి వ్యాప్తిని అరికట్టడానికి
దేశంలోనే ప్రముఖ మౌళిక రంగ నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ తన వంతు భాగస్వామ్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందించింది. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధికి తనవంతుగా 5 కోట్ల రూపాయల విరాళాన్ని
CM జగన్మోహన్ రెడ్డికి MEIL మేనేజింగ్ డైరెక్టర్
PV కృష్ణారెడ్డి అందించారు. ఈ సందర్భంగా కరోనా మహమ్మారి కట్టడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మేఘా సంస్థ ప్రశంసించింది. గురువారం హైదరాబాద్ నగరంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును కలిసి తెలంగాణ CM రిలిఫ్ ఫండ్ కు కూడా5 కోట్ల నిధులు అందించారు. అంతేకాకుండా కర్ణాటక రాష్ట్రంకు రెండు
కోట్లు, ఒరిస్సా రాష్ట్రంకు కోటి రూపాయలు విరాళంగా మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ యాజమాన్యం అందించారు.