కేంద్రం రాష్ట్రాలకు హెచ్చరికలు/SAY NO

ఏప్రిల్ 2020లో రాబోవు పండుగలను దృష్టిలో ఉంచుకుని కొవిడ్-19పై పోరాటంలో భాగంగా ప్రజలు గుంపులుగా చేరే ఎటువంటి మతపరమైన లేదా సామాజిక కార్యక్రమాలకూ అనుమతులు ఇవ్వరాదని, లాక్ డౌన్ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని అన్ని రాష్ట్ర మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలను కేంద్ర హోం శాఖ జారీ చేసింది.

శాంతి భద్రతల నిర్వహణ కోసం మరియు ప్రజల్లో ఆందోళనను దూరం చేయడం కోసం లాక్ డౌన్ విషయంలో ప్రభుత్వం విధించిన అన్ని కఠిన నియమ నిబంధనలను అమలు చేయసేందుకు జిల్లా అధికారులకు మరియు క్షేత్రస్థాయి ఏజెన్సీలకు తగిన సమాచారాన్ని అందించడం జరిగింది. సామాజిక మాధ్యమాల ద్వారా ఏదైనా ఆందోళన కలిగించే అభ్యంతరకరమైన మరియు అసత్య ప్రచారాలను అడ్డుకోవడానికి తగిన చర్యలను కూడా తీసుకోవడం జరిగింది.

ప్రజా సంబంధిత అధికార యంత్రాంగానికి, సామాజిక మరియు మతపరమైన సంస్థలకు మరియు పౌరులకు లాక్ డౌనుకు సంబంధించిన నియమాల సమాచారం గురించి అప్రమత్తంగా ఉండాలని కోరడమైనది. లాక్ డౌన్ నియమ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘించిన ఎడల ఆయా చట్టాలను అనుసరించి మరియు విపత్తు నిర్వహణ చట్టం 2005 మరియు ఐపిసి ప్రకారం వారిపై కేసులు పెట్టడంతోపాటు తగిన చర్యలు తీసుకోబడతాయి.

భారత ప్రభుత్వ వివిధ మంత్రిత్వ శాఖలు మరియు విభాగాలు, రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు కొవిడ్-19పై పోరాటంలో భాగంగా దేశంలో విధించిన లాక్ డౌన్ నియమ నిబంధనలను అమలులో భాగంగా 24.03.2020న భారత ప్రభుత్వం నిర్వచించిన మార్గదర్శకాలకు కేంద్ర హోం శాఖ తదుపరి 25.03.2020/ 27.03.2020/ 02.04.2020 మరియు 03.04.2020 తేదీలలో సవరణలు చేసింది. ఈ నియమ నిబంధనల మార్గదర్శకాల క్లాజు 9&10 ప్రకారం ఎటువంటి మినహాయింపు లేకుండా అన్ని సామాజిక/ సాంస్కృతిక/ మతపరమైన కార్యక్రామలకు అనుమతి లేదు. కావున ప్రజలు గుంపులుగా చేరే ఈ రకమైన కార్యక్రమాలు రద్దు చేయబడినాయి.