ZOOMతో జాగ్రత్త-సైబర్ హెచ్చరికలు

జూమ్ సమావేశ వేదికను ప్రవేటు వ్యక్తులు సురక్షితంగా ఉపయోగించుకునేందుకు వీలుగా, కేంద్ర హోం మంత్రిత్వశాఖ కింద పనిచేస్తున్న సైబర్ సమన్వయ కేంద్రం సూచనలు జారీ చేసింది. ఈ వ్యవస్థను అధికారిక కార్యక్రమాల కోసం ఉపయోగించవద్దని ప్రభుత్వ అధికారులకు సూచించింది.

గతంలో కూడా ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం జారీ చేసిన సూచనలను ప్రస్తావిస్తూ, జూమ్ సురక్షితమైన వేదిక కాదనే విషయాన్ని ఈ సూచనల్లో మళ్ళీ పేర్కొనడం జరిగింది. తమ ప్రయివేటు అవసరాలకోసం ఈ వేదికను ఉపయోగిస్తున్న ప్రైవేట్ వ్యక్తులకు రక్షణ కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ మార్గదర్శకాలను జారీ చేయడం జరిగింది.

 

జూమ్ సమావేశం నిర్వహించే గదిలోకి అనధికారికంగా ఎవరూ ప్రవేశించకుండా నిరోధించడం, సమావేశంలో పాల్గొన్న ఇతర వినియోగదారుల టెర్మినల్స్ పై హానికరమైన దాడి చేయకుండా అరికట్టడమే, ఇప్పుడు ఈ మార్గదర్శకాలను జారీ చేయడానికి ప్రధాన కారణం.

జూమ్ సమావేశ వేదికను ఉపయోగించే ప్రయివేటు వ్యక్తులు తీసుకోవలసిన రక్షణ చర్యల వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.