అర్ధరాత్రి అంగళ్లపై MHA ఆర్డర్

దేశంలో దుకాణాల ప్రారంభానికి MHA ఉత్తర్వులు జారీ చేసింది. మన నగరాల్లో, గ్రామాల్లో రిజిస్టర్డ్ షాపులు 50% కార్మికుల బలంతో మాస్కులు లాగే సామాజిక దూరం పాటించి తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుని వ్యాపారం చేసుకునేందుకు షరతులతో అనుమతులు ఇచ్చింది.

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో షాపింగ్ మాల్స్ మినహా అన్ని దుకాణాలను తెరవడానికి అనుమతి ఉంది.

పట్టణ ప్రాంతాల్లో, నివాస సముదాయాలలోని అన్ని స్వతంత్ర/ పొరుగు దుకాణాలు తెరవడానికి అనుమతి ఉంది. మార్కెట్లు/ మార్కెట్ కాంప్లెక్సులు & షాపింగ్ మాల్స్ లోని షాపులు తెరవడానికి అనుమతించబడవు.

ఇ-కామర్స్ కంపెనీల అమ్మకం ఎసెన్షియల్ గూడ్స్ కోసం మాత్రమే అనుమతించబడుతుంది.

COVID19 నిర్వహణ కోసం జాతీయ ఆదేశాలలో పేర్కొన్న విధంగా మద్యం మరియు ఇతర వస్తువుల అమ్మకం నిషేధించబడింది.

హాట్‌స్పాట్‌లు/కంటెమెంట్ జోన్‌లలో తెరవడానికి అనుమతి లేదు.