మార్చి 15th అర్ధరాత్రి వరకు COVID19 కేసుల సంఖ్య 110: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ

మార్చి 15th అర్ధరాత్రి వరకు COVID19 కేసుల సంఖ్య 110: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ

భారతదేశంలో కరోనా సోకకుండా అరికట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కానీ కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కోవిడ్19 రెండో దశ కొనసాగుతోంది. దేశంలో మార్చి 15 రాత్రి 11.30PM వరకు 110 కేసులు నమోదయినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మహారాష్ట్రలో అత్యధికంగా 31 కేసులు ఒక్క ఆదివారం మహారాష్ట్రలో 12 కొత్త కేసులు నమోదయ్యాయి. కేరళలో ఈ సంఖ్య 22, ఉత్తర్‌ప్రదేశ్‌లో 11గా నమోదైంది. హరియాణాలో 14 కేసులు ధ్రువీకరించిన వాళ్ళందరూ విదేశీయులే.