Mi TV స్టిక్ వచ్చేసింది

అమెజాన్‌ ఫైర్‌ టీవీ స్టిక్‌కు పోటీగా షియోమీ ఎట్టకేలకు తన ఎంఐ టీవీ స్టిక్‌ను భారత్‌లో విడుదల చేసింది. అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ తరహాలోనే ఎంఐ టీవీ స్టిక్‌ను కూడా హెచ్‌డీఎంఐ పోర్టు ద్వారా టీవీకి కనెక్ట్ చేసుకోవచ్చు. భారత్‌లో ఎంఐ టీవీ స్టిక్‌ ధర రూ.2,799గా నిర్ణయించారు. ఆగస్టు 7న మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్లిప్‌కార్ట్‌, ఎంఐ డాట్‌కామ్‌, ఎంఐ హోమ్‌ స్టోర్లలో ఫస్ట్‌సేల్‌ ఆరంభంకానుంది. ఎంఐ టీవీ స్టిక్‌, అమెజాన్‌ ఫైర్‌ టీవీ స్టిక్‌ దాదాపు రెండు ఒకేలా ఉంటాయి.లోగో, డ్యూయల్‌ టోన్‌ కలర్‌ డిజైన్లలో మాత్రమే తేడా ఉంది. ఇది రిమోట్‌ కంట్రోల్‌తో వస్తున్నది. ప్రత్యేకమైన గూగుల్‌ అసిస్టెంట్‌ బటన్‌ను కలిగి ఉంటుంది. ఇందులో గూగుల్‌ డేటా సేవర్‌ ఫీచర్‌, గూగుల్‌ అసిస్టెంట్‌ వాయిస్‌ సపోర్ట్‌ కూడా ఉంది. యాప్‌ల కోసం గూగుల్‌ ప్లే స్టోర్‌ను యాక్సెస్‌ చేయొచ్చు. ఎంఐ టీవీ స్టిక్ ఇన్ బిల్ట్ క్రోమ్ కాస్ట్‌తో రానుంది. అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌, జీ5, డిస్నీ హాట్‌స్టార్‌ తదితర పాపులర్‌ ఓటీటీ యాప్‌లతో వస్తోంది.