సూక్ష్మక్రిముల కిల్లర్ టన్నెల్

తెలంగాణ DGP కార్యాలయంలో సూక్ష్మక్రిములను నివారించే 3V సేఫ్ టన్నెల్ ఏర్పాటు చేశారు. 1.5 మైక్రాన్స్ నుండి 20 మైక్రాన్స్ వరకు పరమాణువుల సూక్ష్మ క్రిములను ఈ టన్నెల్ నుంచి వెళ్లితే డిస్-ఇన్ఫెక్ట్ చేస్తుంది. S-3-V వాస్కులర్ టెక్నాలజీస్ ఏర్పాటు చేసిన ఈ టన్నెల్ డీజీపీ మహేందర్ రెడ్డి, ఉన్నత పోలీస్ అధికారులు పరిశీలించారు. ఈ టన్నెల్ లోపల 20 క్షణాల పాటు ఉండటంతో అన్ని రకాల ఇన్ఫెక్షన్ల నుండి దూరం కావచ్చని వాస్కులర్ టెక్నాలజీ లిమిటెడ్ ప్రతినిధులు వివరంచారు. డీజీపీతో పాట అడిషనల్ డీజీలు జితేందర్, ఉమేష్ ష్రాఫ్, రాజీవ్ రతన్, శివధర్ రెడ్డి, ఐజీలు సంజయ్ జైన్, నాగిరెడ్డి తదితర అధికారులు ఈ విధానాన్ని పరిశీలించారు.