వలస కూలీలు ఇటుక బట్టీల్లో కాయకష్టం

లాక్ డౌన్ నేపథ్యంలో నారాయణ పేట జిల్లాలోని 100కు పైగా ఉన్న ఇటుక బట్టి కేంద్రాలలో పని చేస్తున్న వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు మరియు తెలంగాణ లోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వలస కూలీల కోసం ఇటుక భట్టీల యజమానులు కూలీల సంక్షేమం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మంత్రి శ్రీనివాస్ కూలీల పిల్లల చదువు కోసం బట్టీల సమీపంలో ఏ ప్రాంత ప్రజలు ఉంటే ఆ భాషకు చెందిన ట్యూషన్ మాస్టర్ ను నియమించి పిల్లలకు చదువు చెప్పించాలన్నారు. కూలీల కాలీ సమయంలో సేద తీరేందుకు ప్రత్యేకంగా ఒక షెడ్డు ను నిర్మించాలన్నారు. వారానికి ఒక సారి కూలీల కు వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో స్వీయ నియంత్రణ పాటిస్తూ, సామాజిక దూరం తో కూలీలు పని చేసుకోవాలని మంత్రి సూచించారు. పైన మంత్రి సూచించిన అంశాలను వారం రోజుల లోగా ఇటుక బట్టీల యజమానులు పాటించక పోతే వారి బట్టీలను మూసి వేయించాలని జిల్లా కలెక్టర్ ను మంత్రి శ్రీనివాస్ ఆదేశించారు.

అనంతరం ఇటుక బట్టీలను పరిశీలించారు. వలస కార్మికులకు ఫేస్ మాస్క్ లను పంపిణీ చేశారు. కూలీలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. బట్టీల యజమానులతో మాట్లాడి వలస కూలీలకు అన్ని వసతులు కల్పించాలని సూచించారు. కరోనా మహమ్మారి విస్తరించకుండా అన్ని జాగ్రత్తలు కూలీలు , బట్టి యజమానులు తీసుకోవాలన్నారు మంత్రి శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు చిట్టెం రాం మోహన్ రెడ్డి, DCCB బ్యాంక్ ఛైర్మన్ నిజాం ఫాష, జిల్లా కలెక్టర్ హరిచందన మరియు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.