కరోనాలో పోలీసులపై వలస కార్మికుల దాడి..!

వలస కార్మికుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. ఐఐటీ హైదరాబాద్‌ భవనాల నిర్మాణ పనుల కోసం వచ్చిన 1600 మంది కార్మికులు లాక్‌డౌన్‌ కారణంగా గత నెలరోజులకు పైగా అక్కడే  చిక్కుకు పోయారు. దీంతో కంది ఐఐటీ వద్దే కార్మికులను ఉంచారు.

ఈ క్రమంలో బుధవారం ఉదయం కార్మికులు స్వస్థలాలకు వెళ్లేందుకు సన్నద్ధమయ్యారు. తమను సొంతూళ్లకు పంపాల్సిందే నంటూ ఆందోళనకు దిగారు. అక్కడి చేరుకున్న పోలీసులపై రాళ్లు, కట్టెలతో దాడికి యత్నించారు. కార్మికుల రాళ్ల దాడిలో పోలీసు వాహనం ధ్వంసమైంది. ఘటనా స్థలికి పోలీసు బలగాలు భారీగా చేరుకోవడంతో కార్మికులు వెనక్కి తగ్గారు.