కరోనాలో లైఫ్‌లైన్‌ ఉడాన్ విమానాల మైలురాళ్లు

కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి వ్యాప్తి నేప‌థ్యంలో కేంద్ర పౌర విమాన‌యాన శాఖ లైఫ్‌లైన్ ఉడాన్ కార్య‌క్ర‌మంలో భాగంగా 411 విమానాల‌తో స‌రుకు ర‌వాణా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించింది. ఎయిర్ ఇండియా, అలయన్స్ ఎయిర్, ఐఏఎఫ్ మరియు ప్రైవేట్ క్యారియర్లు లైఫ్‌లైన్‌ ఉడాన్ కింద 411 విమానాలను న‌డిపించాయి. ఎయిర్ ఇండియా, అలయన్స్ ఎయిర్ సంస్థ‌లో వీటిలో మొత్తం 237 విమానాలను నడిపారు. ఇప్పటి వరకు లైఫ్‌లైన్‌ ఉడాన్ విమానాలు 4,04,224 కి.మీ. మేర ప్ర‌యాణించి 776.73 ట‌న్నుల రవాణాను చేప‌ట్టింది. ఈ నెల 28వ తేదీ వ‌ర‌కు చేప‌ట్టిన‌ కార్గో లోడ్ 28.05 టన్నులుగా నిలిచింది. కోవిడ్‌-19కు వ్య‌తిరేకంగా భార‌త్ చేస్తున్న యుద్ధానికి మద్దతుగా ఉండాలా దేశంలోని మారుమూల ప్రాంతాలకు అవసరమైన వైద్య సరుకును రవాణా చేయడానికి గాను దేశీయంగా పౌర విమాన‌యాన‌ శాఖ ‘లైఫ్‌లైన్ ఉడాన్’ విమానాలను న‌డుపుతోంది.

హెలికాప్టర్ సేవల వినియోగం..

పవన్ హన్స్ లిమిటెడ్ సహా హెలికాప్టర్ సేవలు జే అండ్ కే, లడాఖ్‌తో పాటు వివిధ ద్వీప ప్రాంతాలు దేశంలో ఈశాన్య ప్రాంతాల‌కు క్లిష్టమైన వైద్య సామ‌గ్రి ర‌వాణాతో పాటు రోగుల రవాణాను చేప‌డుతున్నారు. ఏప్రిల్ 28 వరకు పవన్ హన్స్ సంస్థ 7,257 కిలోమీటర్ల దూరం ప‌య‌నించి 2.0 టన్నుల సరుకును ర‌వాణా చేసింది. ఈశాన్య ప్రాంతం, ద్వీప భూభాగాలు మరియు కొండ రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టితో ఈ సేవ‌ల‌ను వినియోగిస్తున్నారు. జే అండ్ కే, లడాఖ్, నార్త్-ఈస్ట్ మరియు ఇతర ద్వీప ప్రాంతాలకు ర‌వాణా కార్య‌క్ర‌మాల‌ను వినియోగించేందుకు గాను ఎయిర్ ఇండియా మరియు ఐఏఎఫ్ ప్రధానంగా సహకరించుకుంటూ ముందుకు సాగుతున్నాయి. దేశీయ కార్గో ఆపరేటర్లు స్పైస్ జెట్, బ్లూ డార్ట్, ఇండిగో మరియు విస్టారా వాణిజ్య ప్రాతిపదికన కార్గో విమానాలను నడుపుతున్నాయి. స్పైస్‌జెట్ సంస్థ మార్చి 24 నుండి ఏప్రిల్ 28 వరకు 651 కార్గో విమానాలను 11,34,204 కిలో మీటర్ల దూరం మేర ప‌య‌నింప‌జేసీ 4,741 టన్నుల సరుకు ర‌వాణాను చేప‌ట్టింది. ఇందులో 233 విమానాలు అంతార్జాతీయ కార్గో విమానాలు ఉన్నాయి. మ‌రోవైపు బ్లూడార్ట్ సంస్థ మార్చి 25 నుండి ఏప్రిల్ 28 వరకు 224 కార్గో విమానాలు న‌డిపి 2,44,643 కిలో మీటర్ల దూరం ప్ర‌యాణంతో దాదాపు 3,742 టన్నుల మేర‌ సరుకును ర‌వాణా చేసింది. వీటిలో 10 అంతర్జాతీయ కార్గో విమానాలున్నాయి. ఇండిగో సంస్థ ఏప్రిల్ 3-28 మధ్య కాలంలో 59 కార్గో విమానాలను 96,742 కిలోమీటర్ల దూరం మేర ప్రయాణింప‌జేసి 246 టన్నుల మేర‌ సరుకును రవాణా చేసింది. ఇందులో దాదాపు 18 అంతర్జాతీయ విమానాలు ఉన్నాయి. ప్రభుత్వానికి ఉచితంగా ర‌వాణా చేసిన వైద్య సామాగ్రి కూడా ఇందులో ఉంది. విస్తరా ‌సంస్థ 14 కార్గో విమానాలను ఈ నెల 19-28 మధ్యకాలంలో 20,466 కిలోమీటర్ల దూరం ప్ర‌యాణింప‌జేసి 113 టన్నుల మేర సరుకును రవాణా చేసింది.అంతర్జాతీయంగా ఎయిర్ బ్రిడ్జ్ స్థాప‌న‌..‌

అంతర్జాతీయ రంగంలో, తూర్పు ఆసియాతో ఔషధాలు, వైద్య పరికరాలు మరియు కోవిడ్ -19 ఉపశమన పదార్థాల రవాణా కోసం కార్గో ఎయిర్ బ్రిడ్జ్ స్థాపించబడింది. ఎయిర్ ఇండియా తీసుకు వచ్చిన వైద్య సరుకుల పరిమాణం 668 టన్నులుగా ఉంది. పైన పేర్కొన్న వాటికి అదనంగా, బ్లూ డార్ట్ సంస్థ ఏప్రిల్ 14 నుండి 28 వరకు గ్వాంగ్జౌ నుండి 109 టన్నుల వైద్య సామాగ్రిని ర‌వాణా చేసింది. మ‌రోవైపు బ్లూ డార్ట్ సంస్థ ఈ నెల 25న‌ షాంఘై నుండి 5 టన్నుల వైద్య సరుకును తీసుకువ‌చ్చింది. మ‌రోవైపు స్పైస్ జెట్ సంస్థ ఈ నెల 28 వరకు షాంఘై నుండి 140 టన్నుల వైద్య సామాగ్రిని, ఈ నెల 25 వరకు హాంకాంగ్ మరియు సింగపూర్ నుండి 13 టన్నుల వైద్య సామాగ్రిని స్పైస్ జెట్ దేశంలోకి తీసుకువ‌చ్చింది.