వైజాగ్ దుర్ఘటనపై మంత్రి గౌతమ్ రెడ్డి ప్రగాఢ సానుభూతి

వైజాగ్ సమీపంలో విష వాయువు కారణంగా చనిపోయిన వ్యక్తుల కుటుంబ సభ్యులకు మంత్రి గౌతమ్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇప్పటి వరకు 8మంది చనిపోయారని, స్పృహ తప్పి పోయిన వాళ్ళని ఆసుపత్రికి తరలించామని చెప్పారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా అక్కడి పరిస్థితిని సమీక్షిస్తుంది.గాలిలో ఎంత తీవ్రత వుంది, నీటి పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది సమీక్షిస్తున్నారు.. సీఎం YS జగన్ కూడా ఈ దుర్ఘటనపై సమీక్షిస్తున్నారని ప్రస్తుతానికి ఎవరికి ప్రాణాపాయం లేదన్నారు. AP సర్కారు కేంద్ర ప్రభుత్వం సహాయసహకారాలు తీసుకుంటుందని, లిక్విడ్ లీకేజ్ 90 శాతం ఆగిందన్నారు. ఇకపై నిర్లక్ష్యం వహిస్తే లీగల్ యాక్షన్ ఉంటుందని పరిశ్రమను ఆయన హెచ్చరించారు.