వలస కూలీలకు బాసటగా మంత్రి హారీష్ చర్యలు

తెలంగాణలో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఐదారు రోజుల నుంచి కాలినడకన ప్రయాణం చేస్తున్న వలస కూలీలను మంత్రి హారీష్ రావు పలకరించారు. కరోనా కారణంగా పని, ఆహారం‌లేదని ఈ‌ కారణంతో తమ స్వంత రాష్ట్రాలకు కాలినడకన బయలుదేరినట్లు‌ వలస‌ కార్మికులు వాపోయారు. మనోహరాబాద్ సరిహద్దు ప్రాంతంలో తమ స్వ రాష్ట్రాలకు కాలి నడకన వెలుతున్న వలస కార్మికులను మంత్రి పరామర్శించి మార్గదర్శకాలు తెలియజేసారు.

 

నడి రోడ్డపై మండుటెండలో పిల్లలతో నడుచుకుంటూ వెళుతున్న వారిని చూసి కారు ఆపి పరామర్శించిన మంత్రి వారి మాటలకు‌ విని చలించిపోయారు. లాక్‌‌డౌన్ నేపధ్యంలో‌ఎక్కడికి వెళ్లవద్దని మనోహరాబాద్ పట్టణంలోనే ఆశ్రయం కల్పిస్తానని హరీష్ రావు విజ్ఞప్తి చేసారు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్వరాష్ట్రాలకు వెళతామన్న కార్మికులు మొండి పడ్డారు. పిల్లలతో కాలి‌నడకన వెళ్లడం‌ శ్రేయస్కరం కాదని ఇక్కడే ఉండాలని నచ్చచెప్పడంతో చివరకు అంగీకరించిన వలస‌ కార్మికులు. తెలంగాణలోనే స్థానికంగా ఉండేందుకు అన్ని రకాలుగా సాయం అందిస్తానని వారికి హామీ ఇవ్వడంతో‌ వలస కూలీలు ఆనందం‌ వ్యక్తం చేసారు.