యేసు ప్రభువు కానుకగా చూడాలి

శక్తి గార్డెన్స్ లో పేద ఫాస్టర్లకు నిత్యావసర సరుకుల కిట్స్ పంపిణీ చేసిన మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్సీ రాజేశ్వరరావు

ఫాస్టర్స్ కు అందిస్తున్న నిత్యావసర వస్తువుల కిట్స్ ను యేసు ప్రభువు కానుకగా చూడాలని, ఆపదలో ఉన్న వారిని, నిరుపేదలను ఆదుకునేందుకు ఎప్పుడూ ముందుటామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట శక్తి గార్డెన్స్ లో గురువారం మధ్యాహ్నం పీజేఏస్ పాల్ ఫౌండేషన్ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు సహకారంతో జిల్లాలోని సిద్ధిపేట, గజ్వేల్, హుస్నాబాద్ నియోజక వర్గాలతో పాటు జనగామ జిల్లాల్లోని దాదాపు 500 పైచిలుకు పేద క్రైస్తవ ఫాస్టర్స్ కు బియ్యం, నిత్యావసర వస్తువులను మంత్రి హరీశ్ రావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో ఒకరికొకరు సహకరిస్తూ., మానవత్వం చాటుకోవాలని కోరారు. సీఏం కేసీఆర్ నిరంతరం ప్రజా సంక్షేమం పరమావధిగా భావిస్తూ సీఎం ఆలోచన చేస్తున్నారని తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి చెప్పారు.

శివమ్స్ గార్డెన్స్ లో 250 మంది పేదలకు నిత్యావసర వస్తువుల కిట్స్ పంపిణీ

సిద్ధిపేట: లాక్ డౌన్ నేపథ్యంలో నిరు పేదలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అండగా నిలుస్తున్నారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని శివమ్స్ గార్డెన్స్ లో గురువారం మధ్యాహ్నం సిద్ధిపేట రైస్ మిల్లు అసోసియేషన్, గంప శ్రీనివాస్, వెనిశెట్టి వీరేశం సహకారంతో పట్టణానికి చెందిన 250 మంది నిరుపేద కుటుంబాలకు మంత్రి చేతుల మీదుగా నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.

పట్టణ బట్టల వర్తక సంఘం ఆధ్వర్యంలో 100 మంది పేద గుమస్తా కుటుంబాలకు నిత్యావసర వస్తువుల కిట్స్ పంపిణీ చేసిన మంత్రి హరీశ్ రావు

సిద్ధిపేట: కరోనా నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కు ప్రజలంతా సహకరించాలని మంత్రి హరీశ్ రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పట్టణ బట్టల వర్తక సంఘ భవనంలో గురువారం మధ్యాహ్నం 100 మంది పేద గుమస్తా కుటుంబాలకు కావాల్సిన నిత్యావసర వస్తువుల కిట్స్ ను మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, పట్టణ బట్టల వర్తక సంఘ ప్రతినిధులు, పలువురు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల కిట్స్ పంపిణీ చేసిన మంత్రి హరీశ్ రావు

సిద్ధిపేట : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా దృష్ట్యా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పేదవారికి, ఆపదలో ఉన్న వారికి సాయాన్ని అందించడం అభినంద నీయమని టీపీటీఎఫ్ సేవలను మంత్రి హరీశ్ రావు కొనియాడారు. జిల్లా కేంద్రమైన బీసీ స్టడీ సర్కిల్ లో గురువారం మధ్యాహ్నం పట్టణంలో 50 మంది రోజువారీ కూలీ, చిరు వ్యాపార కుటుంబాలకు వెయ్యి రూపాయల విలువ కలిగిన నిత్యావసర వస్తువుల కిట్స్ ను మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కౌన్సిలర్ చిప్ప ప్రభాకర్, టీపీటీఎఫ్ ప్రతినిధులు తిరుపతి రెడ్డి, రాములు, శివాజీ తదితరులు పాల్గొన్నారు.