మీడియాతో కరోనాపై మంత్రి హారీష్

తెలంగాణ సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. సంగారెడ్డి నుండి 28 మంది ఢిల్లీ ప్రార్ధనలకి వెళ్లారు. అందులో 6 మందికి పాజిటివ్ వచ్చింది. ఆ ఆరుగురు కుటుంభ సభ్యులు 43మందిని ఐసోలేషన్ వార్డులో పర్యవేక్షిస్తున్నాం. CCMBకి శాంపిల్ పంపించాము, ఆ రిపోర్టులు రేపు సాయంత్రం వస్తాయి. ఈ ఆరుగురు ఇంటి దగ్గర సెకండరీ కాంటాక్ట్స్
చెక్ చేయడానికి 42 మెడికల్ టీమ్స్ ఏర్పాటు చేసాము.ఈ ఆరుగురు ఓ కిలోమీటర్ ఇంటి పరిధిలోని ఇళ్లకు వెళ్లి పరీక్షలు చేస్తాము. సంగారెడ్డి, అంగడి పేట, కొండాపూర్, జహీరాబాద్ నాలుగు ప్రాంతాలలో నలుగురు అధికారులను నియమించాము. మైనార్టీలు ఎవరు దీనిని నెగటివ్ అనుకుని తీసుకోవద్దు. ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు కూడా ఎవరీ ఇంట్లో వాళ్ళు ఉన్నారు. డాక్టర్స్ మీ ఇంటికి వచ్చినప్పుడు సహకరించండి. ఆ ఆరుగురుతో ఎవరైనా కలిశారా, తిరిగిరా వాళ్ళు ముందుకు రావాలి. ఫైర్ ఇంజిన్, పురుగు మందులు పరికరాలు, డ్రోన్ ద్వారా స్ర్పేయింగ్ జరుగుతుంది. ఢిల్లీ నుండి వచ్చిన దగ్గర నుండి ఐసోలేషన్ కి వచ్చే వరుకు ప్రతి కదలిక ను చెక్ చేస్తున్నాము. ఉమ్మడి మెదక్ జిల్లాలో 8పాజిటివ్ కేసులు నమోదయ్యాయని మంత్రి హరీష్ రావు అన్నారు.