పైసలు కంటే ప్రాణాలే ముఖ్యం: మంత్రి KTR

లాక్ డౌన్ కరోనా వ్యాప్తి పూర్తిగా కట్టడి ఐన తర్వతానే ఎత్తేయాలి. మంత్రి కేటీఆర్ అభిప్రాయబడ్డారు. ఇప్పుడు ఏదైనా పొరపాటు చేసి వైరస్ వ్యాప్తికి అవకాశం ఇస్తే భవిష్యత్తులో మనల్ని మనం క్షమించుకోలేం. కరోనా కట్టడికి సామాజిక దూరం ఒక్కటే మార్గం. అభివృద్ది చెందిన దేశాలు సైతం కరోనా మహ్మమారిని ఎదుర్కోలేక కష్టాలు పడుతున్నాయి. దేశంలో ఉన్న వైద్య అరోగ్య సౌకర్యాల నేపథ్యంలో వ్యాప్తిని అరికట్టడమే మన ముందున్న ఏకైక పరిష్కారం. 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో అందరికి టెస్టులన్న అలోచన ఆచరణ సాద్యం కాదు. విచ్చలవిడి టెస్టులకు అనుమతిసై ప్రజల భయాందోళనల నేపధ్యంలో టెస్టు సెంటర్ల దోపిడీకి దారి తీస్తుంది. అవసరం అయిన వారీకీ టెస్టులు చేసే వీలుండని పరిస్ధితి ఎర్పడుతుంది. అందుకే విచ్చలవిడి టెస్టులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వదు. కరోనాను ఎదుర్కోనేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్దంగా ఉన్నది. అవసరం అయిన సౌకర్యాలు, వైద్యసామాగ్రిన సిద్దం చేసి ఉంచుతున్నాం. లాక్ డౌన్లో ఒక్క అకలి చావు లేకుండా చూడాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాము. మద్యతరగతి, పేదల సమస్యలను పరిగణలోకి తీసుకుని పనిచేస్తున్నాం. పారిశ్రామిక వర్గాలు, కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నాం. రాష్ర్టంలో కరోనా వ్యాప్తి నిరోధం కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, లాక్ డౌన్ పరిస్ధితుల వంటి పలు అంశాలపైన మంత్రి కె.తారక రామారావు జాతీయ మీడియాతో మాట్లాడారు.

KTR ముఖ్యాంశాలు.

1. జూన్ మెదటి వారంలో భారతదేశం కరోనా వ్యాప్తిలో శిఖరాగ్రస్ధాయికి చేరుకుంటుందన్న పలు నివేదికల మేరకు దేశంలో కరోనా మహ్మమారిని ఎదుర్కోనేందుకు లాక్ డౌన్ కొనసాగింపే సరైందనుకుంటే దాని పొడగించేందుకు సిద్దంగా ఉన్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.

2. అమెరికా, యూరప్ ఖండంలోని ఇటలీ, స్పెయిన్ లాంటి పరిస్థితులు ఇక్కడ తలెత్తకుండా ఉండాలంటే లాక్ డౌన్, సామాజిక దూరం ఒక్కటే మార్గమన్న ఉద్దేశ్యాన్ని ప్రధానికి కూడా సియం గారు తెలిపారు. అభివృద్ది చెందిన దేశాలు సైతం ఎదుర్కోలేని కరోనా సంక్షోభాన్ని భారత్ ఎదుర్కోవడం సాధ్యం కాదన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు

3. లాక్ డౌన్ సమయంలో పేదలు, వలస కార్మికుల సంక్షేమం పైన దేశంలోని ఇతర రాష్ర్టాలకు తెలంగాణ ఒక మార్గదర్శిగా అదర్శంగా ఉన్నది. పేదలకు రేషన్ ఇవ్వడం, వలస కార్మికులకు అహార సరఫరా, కరోనా కట్టడి కోసం పనిచేస్తున్న సిబ్బందికి ప్రొత్సాహాకాలు వంటి పలు కార్యక్రమాలను ప్రభుత్వం చేస్తుంది.

4. అమెరికాలోని న్యూయార్క్ ఇలాంటి ఆర్థికంగా ఎంతో అగ్ర భాగాన ఉన్న పట్టణాలు, దేశాలకు సైతం కరోనా వైరస్ ను ఎదుర్కోవడంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అక్కడ అవసరమైన వెంటిలేటర్లు, అసుపత్రులు కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నదంటే ప్రపంచంలోని ఏ ప్రాంతాము కరోనాను ఏదుర్కోనే పరిస్ధితిలో లేదు. కేవలం తెలంగాణనో, భారతదేశం మాత్రమే కాదు, అమెరికా లాంటి అగ్ర రాజ్యాలు కూడా కరోనా వైరస్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేదన్న విషయాన్ని ఈ పరిస్థితి సూచిస్తుందన్నారు

5. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగించడం ద్వారా మాత్రమే వైరస్ ని ఎదుర్కోవచ్చన్న అభిప్రాయం లో ముఖ్యమంత్రి గారు ఉన్నారు.

6. లాక్ డౌన్ ఎత్తేసే ముందు ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో వైరస్ వ్యాప్తిని పరిగణలోకి తీసుకోని, వ్యాప్తి అగిన తర్వతానే ఏత్తేయాలి

7. కరోణ హాట్ స్పాట్లుగా పేర్కొంటున్న ప్రాంతాల్లో టెస్టులకు సంబంధించిన విషయంలో టెస్టుల సామర్థ్యాన్ని మరింత పెంటాలి. అదే సమయంలో కరోనా వైరస్ నేపథ్యంలో భయాందోళనలు నెలకొన్న పరిస్థితుల్లో, విచ్చలవిడి కరోనా టెస్టులకు అనుమతిస్తే, అసలైనా రోగులకు టెస్టులు చేయించుకునే అవకాశం లభ్యం కాకపోవచ్చు

8. దీంతోపాటు విచ్చలవిడిగా టెస్టింగ్ సెంటర్లకు అనుమతులిస్తై ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లు ప్రజలను భయాందోళనలను ఆసరా చేసుకునే అవకాశం ఉన్నది. అందుకే విచ్చలవిడిగా టెస్టులకు అనుమతులు ఇవ్వడం లేదు. దీని బదులు కరోనా వ్యాప్తిని అరికట్టే అంశంపైన అత్యంత ప్రణాళికాబద్ధంగా పని చేస్తూ ముందుకు పోతున్నాం. అయినా 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఎన్ని టెస్టులు చేస్తే రోగులను గుర్తు పట్టగలమో గుర్తించాలని, దీని బదులు వ్యాప్తిని అరికట్టడమే కరోనా నుంచి విముక్తి మార్గం అన్నారు.

9. లాక్ డౌన్ పరిస్ధితులను ప్రభుత్వం ఎప్పటికప్పడు పర్యవేక్షిస్తుంది. ఎట్టి పరిస్ధితుల్లో ఒక్క అకలి చావు ఉండకూడదన్న లక్స్యంలో పనిచేస్తున్నాం. దీంతోపాటు ప్రయివేటు ఉద్యోగాలు చేస్తున్నావారికీ జీతాలివ్వాలని సూచించాం. కూలీలకు ప్రభుత్వం అదుకుంటుంది. అద్దెల వంటి ఖర్చుల విషయంలో ప్రజలను బలవంతపెట్టకుండా మరికొంత సమయం ఇవ్వాలని మార్గదర్శకాలు జారీ చేశామన్నారు.

10. లాక్ డౌన్ వలన ప్రజలకు, సమాజానికి, ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులున్నప్పటికీ వైరస్ వ్యాప్తి నిరోధమే అత్యంత కీలకమైన అంశం అన్నారు. ఏ కారణం వలన అయినా ఒకవేళ పరిస్థితి చేయి దాటితే మనల్ని మనం భవిష్యత్తులో క్షమించుకోలేమన్నారు. ప్రజల ప్రాణాల కన్నా అర్ధిక ప్రగతి వంటి అంశాలు ముఖ్యం కాదన్నారు. ప్రజలు అరోగ్యంగా ఉంటే ఇప్పటికంటే ఎక్కువ కష్టపడి ప్రగతి సాధించవచ్చన్నారు. మూడు దశల్లో కరోనా వైరస్ ని ఎదుర్కోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నది

11. కరోనాను ఎదుర్కొనేందుకు అనేక రకాలుగా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది, ఈ మేరకు అనేక నూతన ఐసోలేషణ్ వార్డుల ఏర్పాటు, అవసరం అయిన వైద్య సామాగ్రిని సిద్దం చేస్తున్నది. ఏలాంటి పరిస్ధితి ఎదురైనా ప్రభుత్వం సిద్దంగా ఉన్నదని, ఇందుకు అవసం అయిన పిపిఈలను, మాస్కులు, ఇతర వైద్య సామాగ్రి, మరిన్ని అసుపత్రులను ఎర్పాటు చేయడం వంటి చర్యలు చేపట్టాం. అవసరం అయిన వైద్య సామాగ్రిని సమకూర్చుకుంటున్నాం. 15000 బెడ్లను సిద్దం చేస్తున్నాం, అవసరం అయితే ప్రయివేట్ మెడికల్ కాలేజీలు సిద్దంగా ఉన్నాయి. పరిశ్రమలను అదుకునేందుకు ఇప్పటికే పరిశ్రమలు, కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నామని KTR తెలిపారు.