కరోనా సాంగ్ ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్

కరోనా వైరస్ కట్టడి చేయడంలో కీలకపాత్ర వహిస్తున్న వివిధ సిబ్బంది సేవలను గుర్తిస్తూ నగర GHMC మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి బొంతు శ్రీదేవి ఓ ప్రత్యేక గీతాన్ని నిర్మించారు. ఈ కరోనా వైరస్ అవగాహన గీతాన్ని ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు, కందికొండ సాహిత్యాన్ని అందించారు.

ఈ గీతాన్ని ఈరోజు పురపాలక శాఖ మంత్రి KTR ప్రగతి భవనంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మరియు మేయర్ బొంతు రామ్మోహన్ లున్నారు. ఈ ప్రత్యేక గీతం ఖచ్చితంగా ప్రజల్లో మరింత అవగాహన కల్పిస్తుందని, వైరస్ కట్టడీ కోసం పని చేస్తున్న సిబ్బంది పట్ల గౌరవాన్ని పెంచుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు.