ఐక్యమత్యంతో ITను ఆడుకుందాం:KTR

ప్రస్తుతం సమాజంలోని అన్ని వర్గాలకు కరోనా వైరస్ రూపంలో ఒక సవాలు ఎదుర్కొంటుందని ఈ సవాలును సమిష్టిగా ఎదుర్కొందామని మంత్రి కే. తారకరామారావు పిలుపునిచ్చారు. ఈరోజు సిఐఐ తెలంగాణ చాప్టర్ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన మంత్రి కే. తారకరామారావు ఎట్టిపరిస్థితుల్లోనూ పారిశ్రామిక వర్గాలు, తమ ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తీసివేయకుండా, ఈ సంక్షోభ కాలంలో వారికి అండగా నిలవాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పారిశ్రామిక వర్గాలకు ప్రత్యేకంగా ఒక లేఖను కూడా రాసారు. ఉద్యోగులకు అండగా ఉండేందుకు అవసరం అయితే కంపెనీలు తమ ఇతర వ్యయాలు తగ్గించుకునేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు. లాక్ డౌన్ తర్వతా సైతం అవసరమైన మేరకు పారిశ్రామిక వృద్ది కొనసాగాలంటే వర్క్ ఫోర్సు కు నమ్మకం, బరోసా కలిగించడమే అత్యంత పెద్ద సవాళన్నారు. ప్రభుత్వం పారిశ్రామిక వర్గాలకు అండగా ఉంటుందని మంత్రి కెటియార్ తన లేఖలో పెర్కోన్నారు.

ఈరోజు జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో కరోనా వైరస్ను మరింతగా వ్యాప్తి చెందకుండా దాని కట్టడికి తీసుకుంటున్న చర్యలను మంత్రి కెటియార్ సిఐఐ సభ్యులకు వివరించారు. ఇప్పటికే రాష్ట్రంలో ఇందుకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు సిద్ధంగా ఉన్నాయని ముఖ్యంగా పిపిఈలు, మాస్కులు, టెస్టింగ్ కిట్లు, వెంటిలేటర్ల వంటి అన్ని ఎర్పాట్లను చేసిందని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఇందుకోసం సమాజంలోని పౌరులతో పాటు అన్ని రంగాల మద్దతును ప్రభుత్వం కోరుతున్నదని ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ తెలిపారు.

ప్రస్తుతం ఎదురైనా సంక్షోభంలోనూ అనేక అవకాశాలు పారిశ్రామికవర్గాలకు ఉన్నాయని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా హెల్త్ కేర్, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బయోటెక్ ఇండస్ట్రీలు ప్రస్తుతం ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయని, ఈ నేపథ్యంలో ఆయా రంగాల్లో ఉన్నటువంటి అవకాశాలను పరిశీలించాలని పారిశ్రామికవేత్తలకు మంత్రి కేటీఆర్ సూచించారు. ఈ రంగాలకు సంబంధించి అయా రంగాల్లోని పెట్టుబడులకు ఉన్నటువంటి అవకాశాలపైన ప్రభుత్వానికి సిఐఐ ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసి ఇవ్వాలని మంత్రి కోరారు.
ఈ సందర్భంగా పలువురు పారిశ్రామికవేత్తలు మంత్రి కేటీఆర్ తో సంభాషించారు.

ప్రభుత్వం పారిశ్రామికవర్గాలకు ముఖ్యంగా సూక్ష్మ మధ్య తరగతి పారిశ్రామిక రంగానికి మరింత సహకారం అందించాల్సిన అవసరం ఉన్నదని, ఇప్పటికే ఈ రంగం కొంత ఒత్తిడిలో ఉన్నదని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి తద్వారా ఆర్థిక అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తుందని, పారిశ్రామిక వర్గాల వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. వారు అడిగిన పలు అంశాల పైన స్పందించిన మంత్రి కేటీఆర్, ప్రస్తుతం 25 శాతం ఆర్థిక వ్యవస్థ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని లాక్ డౌన్ పరిస్థితులు సడలించిన తర్వాత ఆర్థికాభివృద్ధి పుంజుకుంటుదన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అయితే లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత పారిశ్రామిక రంగం లోని వర్క్ ఫోర్సు కి నమ్మకం కలిగించడం అత్యంత పెద్ద సవాలు అవుతుందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు. కరోనా కట్టడి కోసం ప్రభుత్వాలు చర్యలు తీసుకున్న నేపథ్యంలో సామాజిక దూరం అనేటువంటి కొత్త ఆలోచన ప్రస్తుతం అందరి మదిలోనూ నెలకొన్నదని, ఇలాంటి నూతన ఆలోచనలు, అవసరాలు రేపటి రోజుల్లో కంపెనీలు తమ కార్యకలాపాలు నిర్వహించే సందర్భంగా ఎదురయ్యే అవకాశం ఉందన్నారు.

ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన సహాయ కార్యక్రమాలతో కలిసి రావాలని, ముఖ్యంగా క్రిటికల్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి తమ కంపెనీల సియస్సార్ నిధులను వినియోగించాలని మంత్రి కేటీఆర్ కోరారు.