విదేశాల నుంచి వచ్చిన తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తుల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి పోలీసులు రంగం సిద్దం చేశారు. సోషల్ మీడియా యాప్ సహకారంతో నిఘా పెడుతున్నారు. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు స్వీయ నియంత్రణ పాటించకుండా ఇష్టారీతిలో తిరుగుతుండడంతో పోలీసు శాఖ అధికారులకు ఆగ్రహానికి గురవుతున్నారు. దీన్ని అరికట్టడానికి విదేశాల నుంచి వచ్చిన ఉభయ తెలుగు రాష్ట్రాల వ్యక్తులపై జియో ట్యాగింగ్ ద్వారా నిఘా పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా సొంత యాప్ ద్వారా హౌస్ క్వారంటైన్ లో ఉన్న వారిపై నిఘా పెట్టారు. ఆంధ్రప్రదేశ్ లో 11 వేల మంది పై తెలంగాణలో 22 వేల మంది పైన పోలీస్ అధికారులు నిఘా పెట్టారు. హౌస్ క్వారంటైన్ ఉన్న వాళ్లంతా కూడా బయట తిరుగుతుండంతో కాంటాక్ట్ కరోనా వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 33 వేల మంది విదేశాల నుంచి వచ్చారు. వీరిలో కొంతమంది కనిపించకుండా పోయారు. విదేశాల నుంచి వచ్చినట్టు గుర్తించిన వారిని జియో ట్రాక్ ట్రాక్ చేస్తున్నారు. సంబంధిత విదేశాల నుంచి వచ్చిన ప్రతీ వ్యక్తికి జియో ట్యాగ్ చేస్తున్నారు. జియో ట్యాగ్ ఉన్న వ్యక్తి తన ఇంటి నుంచి బయటికి వచ్చిన వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం వెళుతుంది. దీంతో వెంటనే స్థానిక పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుంటారు. హౌస్ క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని వెంటనే ప్రభుత్వ హౌస్ క్వారంటైన్ కు తరలిస్తారు. అయితే ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో కూడా ఇది ప్రారంభమైనట్లు అధికారులు వెల్లడించారు.