శీతాకాల సమావేశాలపై మోడీ మనస్సులో మాటశీతాకాల సమావేశాలపై మోడీ మనస్సులో మాట

శీతాకాల సమావేశాలపై మోడీ మనస్సులో మాట

దేశ ప్రగతి కోసం పార్లమెంటులో చర్చలు జరగాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. రాజ్యాంగ దినోత్సవ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని.. ప్రతి ప్రశ్నకు జవాబిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ నిర్వహిస్తున్నామని.. ఇందులో భాగంగా దేశం నలుమూలలా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. స్వాత్రంత్య్ర దినోత్సవ సమయంలో కలల సాకారం దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రజలు తమ వంతు సాయం అందించేందుకు ముందుకొస్తున్నారని.. ఇది దేశ ఉజ్వల భవిష్యత్తుకు శుభ సంకేతమని హర్షం వ్యక్తం చేశారు.