వర్షాలు వస్తున్నాయి..

మన దేశంలో డైనమిక్ మోడల్ ప్రకారం సాధారణం కంటే ఎక్కువే వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఏడాది వర్షాలు సాధారణంగా ఉంటాయి. కరోనా కష్టకాలంలో రైతాంగానికి ఈ వర్షపాతం వార్త ఓ శుభవార్తే. దేశంలో 96%-104% మధ్య సగటు వర్షపాతం ఉండబోతోంది.
లా-నినా పరిస్థితుల వల్ల అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం కూడా ఉంది. జూన్ 1కి కేరళను రుతుపవనాలు తాకనున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, బిహార్, యూపీలోని కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు రాక 3 నుంచి 7 రోజులు ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. తిరోగమనం కూడా మన దేశానికి అనుకూలంగా రావడం హర్షించదగిన విషయం.