బతుకు పోరాటంలో రైలు బండ్లు

దేశంలో కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో లౌక్ డౌన్ ప్రారంభమైన నాటి నుంచి కూరగాయలు, పాలు, పాల ఉత్పత్తులు, వ్యవసాయ అవసరాల కోసం వినియోగించే విత్తనాలు లాంటి వాటిని వివిధ ప్రాంతాలకు చేరవేసేందుకు భారతీయ రైల్వే 67 ప్రత్యేక మార్గాలను (134 రైళ్ళు) గుర్తించింది. ఏప్రిల్ 10 వరకూ 62 మార్గాల్లో 171 రైళ్ళు నడుస్తున్నాయి.

ఢిల్లీ మొదలుకుని ముంబై, కొల్ కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరులను అనుసంధానించడానికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధమయ్యాయి. అదనంగా ఈశాన్య భారతంలో సరఫరా కోసం గౌహతికి సరైన మార్గాన్ని కూడా నిర్ణయించారు. భోపాల్, అలహాబాద్, డెహ్రాడూన్, వారణాసి, అహ్మదాబాద్, వడోదర, రాంచీ, గోరఖ్ పూర్, తిరువనంతపురం, సేలం, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, రూర్కెలా, బిలాస్ పూర్, భూసావాల్, నాగ్ పూర్, అకోలా, జల్గావ్, సూరత్, పూణె, రాయ్ పూర్, పాట్నా, అసన్సోల్, కాన్పూర్, జైపూర్, బికనీర్, అజ్మీర్, గ్వాలియర్, మధుర, నెల్లూరు, జబల్పూర్ మొదలైన ముఖ్యమైన నగరాలను కలుపుతూ మార్గం వేయడం జరిగింది.

డిమాండ్ తక్కువగా ఉన్న మార్గాల్లోనూ రైళ్ళు నడుస్తున్నాయి. తద్వారా దేశంలో అనుసంధానం కాని భాగమేదీ లేదు. అన్ని సాధ్యమైన ప్రదేశాలకు రైళ్ళు వెళుతున్నాయి. తద్వారా గరిష్టంగా చేరవేయడానికి అవకాశం ఏర్పడింది.

ప్రత్యేక రైళ్ళ లభ్యత గురించి అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ఉద్యానవన విభాగ కార్యదర్శులు మరియు మిషన్ సంచాలకులంతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. దేశ వ్యాప్తంగా 76 మందికి పైగా అధికారులు హాజరైన ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కార్యదర్శి, డి.ఎ.సి మరియు ఎఫ్.డబ్ల్యూ, అడిషనల్ మెంబర్ (కమర్షియల్) రైల్వే బోర్డ్, రైల్వే బోర్డు ఈడీలు, CONCOR, SFAC, NHB మరియు డిపార్ట్ మెంట్ లోని అధిక భాగం సీనియర్ ఆఫీసర్లు ఇందులో పాల్గొన్నారు.

రైల్వే విభాగం నడుపుతున్న ఈ రైళ్ళను సద్వినియోగం చేసుకోవడానికి అన్ని రాష్ట్రాల మిషన్ డైరక్టర్లు మరియు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సంబంధింత కార్యదర్శులు తమ వనరులను సమీకరించాలని అభ్యర్థించారు. కొత్త మార్గాలు లేదా రాష్ట్రాల నుంచి డిమాండ్ లు ఏవైనా ఎదురైతే అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రైల్వేబోర్డు వాణిజ్య విభాగం అదనపు సభ్యుడు ప్రతిపాదించారు. వీటి వేళల గురించి కూడా అన్ని విభాగాల అధికారులతో పంచుకోవడం జరిగింది. భారతీయ రైల్వే వెబ్ సైట్ లో కూడా ఇండ ప్రత్యేక పార్సిల్ రైళ్ళకు సంబంధించిన వివరాలు అందుబాటులో ఉన్నాయి.