కరోనాలో కోటికి పైగా మాస్క్‌ల‌ను కుట్టారు.. ఇండియా ది గ్రేట్

దేశవ్యాప్తంగా వివిధ స్వయం సహాయక బృందాలు (ఎస్‌హెచ్‌జీ) కోటికి పైగా ముఖ మాస్క్‌ల‌ను తయారు చేశాయి. కేంద్ర గృహ మ‌రియు ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ యొక్క డీఏవై-ఎన్‌యుఎల్ఎం ప్ర‌తిష్టాత్మ‌క ప‌థ‌కంలో భాగంగా కోవిడ్ -19 తో పోరాటానికి ఎస్‌హెచ్‌జీలు చేస్తున్న నిర్విరామ‌ ప్రయత్నం, సానుకూల శక్తి మరియు క‌న‌బ‌రిచిన ఐక్య సంకల్పాన్ని ఈ చ‌ర్య ప్ర‌తిబింబిస్తోంది.

మిషన్ మద్దతుతో మహిళ‌లు ఎలా స‌గ‌ర్వ పారిశ్రామికవేత్తలుగా ఎదిగి చూపార‌ని ఈ గర్వించదగ్గ క్ష‌ణంలో తేల్చి చెబుతోంది. దేశంలో ఎస్‌హెచ్‌జీల మ‌హి‌ళ‌లు క‌న‌బ‌రుస్తున్న స్థితిస్థాపకత విధానం ఇత‌రులు త‌మ ప్ర‌య‌త్నాల‌ను మ‌రింత శ‌క్తితో ద్విగునీకృతం చేసే విధంగా ప్రేరేపిస్తోంది. నిజమైన అర్థంలో ఇది జీవితాలను పరిరక్షించ‌డంలో మహిళా సాధికారతను ప్ర‌తిబింబిస్తోంది.

ఎస్‌హెచ్‌జీ స‌భ్యులైన కొంద‌రు మ‌హిళ‌ల అభిప్రాయాలు..

శ్రీమతి శుభంగి చంద్రకాంత్ ధైగుడే సమృద్ధి ఏరియా లెవల్ ఫెడరేషన్ (ఎఎల్ఎఫ్) అధ్య‌క్షురాలు. ఆమె ఫోన్ ద్వారా ఆర్డర్లు సేకరించి మహారాష్ట్రలోని టిట్వాలాలోని తన ఇంటి వద్ద ఉంటూ ముఖ మాస్క్‌లను కుట్టారు. తాము మొ‌త్తం 50000 మాస్క్‌ల‌ను తయారు చేశామ‌ని తెలిపింది. ఈ కార్యక్ర‌మంలో శుభంగి చంద్రకాంత్‌తో పాటుగా మరో 45 మంది మహిళలు ముఖ మాస్క్‌ల త‌యారీ ప్రక్రియ‌లో పాలుపంచుకున్నారు. కోవిడ్‌-19 వ్యాప్తి వంటి క‌ఠిన స‌మ‌యంలో దేశ ప్ర‌జ‌ల ఆరోగ్యానికి ఉప‌యోగ‌ప‌డేలా ముఖ మాస్క్‌ల‌ను త‌యారు చేసి అందించ‌డం ఎంతో సంతృప్తిగాను స‌గ‌ర్వంగా ఉంద‌న్న‌ట్టు ఆమె ప్రత్యేకమైన చిరునవ్వుతో వెల్ల‌డించింది.

శ్రీ‌మ‌తి మీనూ ఝా

రాజస్థాన్ రాష్ట్రం కోటలోని సావర్ణి ఎస్‌హెచ్‌జీ సభ్యురాలైన‌ శ్రీమతి మీనూ ఝా మాట్లాడుతూ, తాము వేసిన ఈ చిన్న అడుగు ఇతరులకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంద‌ని తెలిపారు. దీనిని తాము ఊహించలేదని చెప్పారు. లాక్‌డౌన్ అమ‌లులో ఉన్న ఈ సమయంలో కూడా ఈ పోరాటంలో సహకరించేందుకు వీలుగా ప్రత్యేక సామర్ధ్యం మనందరికీ ఉందని శ్రీమతి మీనూ ఝా పునరుద్ఘాటిస్తుంది.

అస్సోం రాష్ట్రపు నాగావ్ లోని రన్జూన్ స్వయం సహాయక బృందం సభ్యురాలైన శ్రీ‌మ‌తి ర‌ష్మీ మాట్లాడుతూ అస్సాంలో సాంప్రదాయ వస్త్రం మరియు గౌరవ చిహ్నమైన గామోచా నేడు ఆరోగ్యం, భద్రత మరియు పరిశుభ్రతల‌కు చిహ్నంగా మారింద‌ని అన్నారు. ఈ సాంప్రదాయ వస్త్రాన్ని ఉపయోగించి ముసుగులు తయారు చేయడంలో తాము బిజీగా ఉన్న‌ట్టు తెలిపారు.

జ‌మ్ము కాశ్మీర్ రాష్ట్రం కతువాలోని ప్రాయాస్ స్వ‌యం స‌హాయ‌క బృందం స‌భ్యురాలైన శ్రీమతి ఉపేష్ అండోత్రా మాట్లాడుతూ త్రివర్ణం క‌లిగిన ముఖ మాస్క్‌ల‌ను తయారుచేయ‌టాన్ని తాను గ‌ర్వ కార‌ణంగా భావిస్తున్నామ‌ని తెలిపారు.