ఐసిఏఆర్ కరోనా టన్నెల్ ప్రారంభం

భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ(ఐసిఏఆర్) న్యూఢిల్లీ వారి వ్యవసాయ ఇంజనీరింగ్ విభాగం వారు అభివృద్ధిచేసిన పుసా ప్రక్షాళన మరియు పరిశుభ్రం చేసే టన్నెల్ను కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌధురి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిఏఆర్ఇ కార్యదర్శి మరియు ఐసిఏఆర్ డైరెక్టర్ జనరల్ డా. త్రిలోచన్ మహాపాత్ర, ఐసిఏఆర్ –ఐఏఆర్ఐ, న్యూఢిల్లీ సంచాలకులు డా. ఏ.కె. సింగ్ పాల్గొన్నారు.

ఈ పరిశుభ్రత టన్నెల్లో కాలుతో తొక్కితే వచ్చేటట్లుగా ఏర్పాటు చేసిన సబ్బు మరియు నీరుతో చేతులను శుభ్రపరచుకోవడానికి మరియు టన్నెల్లో 20 సెకన్ల పాటు ఫాగింగ్ ఉంటుంది. ఈ టన్నెల్లో ఆరోగ్య విభాగం వారు సూచించిన 0.04% గాఢత గల క్వార్టనెరీ అమ్మోనియం మిశ్రమం(క్యూఏసి) ఉపయోగిస్తారు.