కరోనా సామాజిక వ్యాప్తి ఆరంభం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహామ్మారి వైరస్‌ సామాజిక వ్యాప్తి ఆరంభం ప్రాథమిక స్థాయిలో ఉందని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ప్రజలను హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఇళ్లలోనే ఉండాలని, సామాజిక దూరం తప్పకుండా పాటించాలన్నారు.

రాబోయే రోజుల్లో 2-3 లక్షల ర్యాపిడ్‌ పరీక్ష విధానం పద్దతితో ముందుకు వెళ్తామని వైరస్ వ్యాప్తిపై అప్పుడే ఓ అవగాహన వస్తుందని అభిప్రాయబడ్డారు. ఏప్రిల్‌ 14 తర్వాత లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తేయడం అసాధ్యమని హాట్‌స్పాట్ల ప్రాంతాల్లో ఆంక్షలు అమలు అవుతాయని జవహర్‌రెడ్డి తెలిపారు.