మోటెరా క్రికెట్ స్టేడియం, అహ్మదాబాద్ గుజరాత్.
‘కెమ్ చో ట్రంప్’ కార్యక్రమం ఇక్కడే జరగనుంది.
ప్రపంచంలోనే No1 అతి పెద్ద క్రికెట్ స్టేడియం గుజరాత్ లోని అహ్మదాబాద్ లో నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. లక్ష పది వేల మంది సామర్ధ్యంతో (1,10,000) ఫ్లడ్ లైట్స్, గ్రీనరీ, మౌలిక వసతులు అన్ని కూడా సర్వాంగ సుందరంగా సిద్ధమయ్యాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 24, 25 తేదీల్లో భారత్లో పర్యటించనున్నారు. భారత్ పర్యటనలో భాగంగా ఎయిర్పోర్టు నుంచి అహ్మదాబాద్ స్టేడియం వరకూ రోడ్డుకు ఇరువైపులా డెబ్భై లక్షల మందితో స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ప్రపంచంలో అతిపెద్ద స్టేడియంగా రికార్డులకు ఎక్కబోతున్న అహ్మదాబాద్ స్టేడియాన్ని ట్రంప్ అధికారికంగా ఆరంభించి ప్రసంగించబోతున్నారు.
యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ కోసం అహ్మదాబాద్ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నది. 2019 హ్యూస్టన్లో జరిగిన ‘హౌడీ మోడీ’ తరహాలోనే అహ్మదాబాద్ స్టేడియంలో ‘కెమ్ చో ట్రంప్’ (హౌ ఆర్ యూ ట్రంప్) సభ జరగబోతున్నది.