మీ ప్రాణాలకు విలువుందా? ఎవరివ్వాలి?

మీ ప్రాణాలకు విలువుందా? ఎవరివ్వాలి?

చైనా అంటేనే మనకోక చిన్నచూపు ఎందుకంటే డమ్మీ నాణ్యతలేని వస్తువులు సరఫరా, విలువల్లేని వ్యాపారం,
స్వార్ధ పోకడలు, నియంతృత్వంగా వ్యవహారించే
నియంతృత్వ ప్రభుత్వాలు. అక్కడ మానవ హక్కులు ఉండవు, ప్రేమ ఆప్యాయతలు, గౌరవ మర్యాదలు
అసలు ఆ మాటలకు విలువలుండవు. అలాంటి దేశం మనకు పొరుగు దేశమే తప్ప ఇప్పటికి మన మిత్రుడు మాత్రం కాదు.
కేవలం నేను,నా అంతేకానీ తన,మన అనురాగాలు ఏముండవు అలాంటి దేశంలో ఉన్న నగరమే ఊహాన్.

ప్రపంచ దేశాల్లో కొద్ది రోజుల వరకు ఆ ఊరు పేరు ఇతర దేశస్తులకు ఎవరికి తెలియదు. మన 7 ఖండాల్లో ఉండే నగరాల్లో అదొక్కటి. ఇప్పుడు మాత్రం కరోనా వైరస్ ను ప్రపంచానికి ఎగుమతి చేసిన పుట్టిన ఊరుగా చరిత్రలోకి ఎక్కింది. ఉహాన్ అంటేనే జంతువల వింత మార్కెటు
ఉండే ప్రాంతం. ఊహాన్ ఇప్పటి వరకు చైనా చరిత్ర
పుటల్లోకి ఎక్కే అద్భుతాలు సాధించనప్పటికి కరోనాను ఎదుర్కొగలిగింది. కానీ కరోనా కారణంగా మరణాల సంఖ్యను
చైనా చాలా చాకచక్యంగా కప్పిపెట్టి దృష్టి మరల్చిందనే విమర్శలు సోషల్ మీడియాలో మాత్రం అనుమానాలు
వ్యక్తం అవుతున్నాయి.

ఆ దేశానికి శత్రువులను ఎదుర్కొనేందుకు (అప్పట్లో మంగోలియన్లు) చైనా గోడను నిర్మించారు ప్రపంచ వింతల్లో ఓ స్థానాన్ని సంపాదించి తరతరాలుగా ఓ పెట్టని కోటగా ఇప్పటికి సజీవంగా నిలబడింది. ఇదంతా ఎందుకంటారా ఈ అద్భుత కట్టడంలో సజీవ సమాధులైన సామాన్యుల సంఖ్య మన ప్రపంచంలో ఇప్పటికి ఎవరికైనా తెలుసా. అలాగే ఇప్పుడు కరోనా వైరస్ (COVID19) మృతులపై ఎలాంటి సమాచారం బయటకు పొక్కకుండా ప్రపంచ మీడియాకు కంటబడకుండా అక్కడున్న కమ్యూనిస్టుల నియంత సర్కారు అసలు నిజాలు దాచేసిందని అంతర్జాతీయ జర్నలిస్టులు అభిప్రాయబడుతున్నారు.

చైనాలో భారతదేశంలా మాట్లాడే స్వాతంత్య్రం, హక్కులు ఉండవు. అక్కడంతా అప్పట్లో యూరప్ ఖండంలోన్న ముస్సోలిని, నెపోలియన్, హిట్లర్ పాలించిన నియంత నిర్ణయాల్లా ఏకఛత్రాధిపత్యం పోకడలు మాత్రమే ఉంటాయి.
ఆ దేశంలో ప్రముఖులకే భద్రత కరువు ఎలాగంటే అక్కడి పెద్దలే ఎక్కడైన ఎప్పుడైనా ఏమైనా చేయవచ్చు. అలాంటిది సామాన్యులు పిట్టల్లా రాలిపోతే ఆ సమాచారాన్ని మీడియాకు పొక్కనిస్తుందా అబ్బే అంత సీన్ అక్కడి ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాకు అక్కడ అధికారాలు ఉండనే ఉండవు. ఎందుకు ఇదంతా చెబుతున్నాం అంటారా కరోనా పుట్టినిల్లు ఊహాన్ నగరంలో మరణాల సంఖ్యను బుట్టదాఖలు, తారుమారు చేశారు. అక్కడి విద్యుత్ ఆధార శవ దహన యంత్రాలు రేయింభవళ్లు నిర్విరామంగా పని చేయడం కారణంగా కరోనా సోకిన వేలాది కాదు కాదు లక్షలాది
మంది సామాన్య ప్రజలను కరెంటుకు ఆహుతి చేశారనే అనుమానాలున్నాయి. కారణాలు పరిశీలిస్తే ఊహాన్, అలాగే పరిసరాల్లో దాదాపు 80లక్షల మొబైల్ సిమ్ కార్డులు ఒక్కసారిగా మూగపోయాయి. వేలాది అపార్ట్ మెంట్లలో
కనీసం దీపం పెట్టే దిక్కు మొక్కు లేకుండా పోయింది.
ఎవరైనా ఏమైనా ప్రభుత్వంపై గొంతెత్తి ప్రశ్నలు అడిగితే
ఆ గొంతు మళ్ళీ ఎక్కడ వినిపించదు.

ఇదే ఇండియా మన దేశంలో ఐతే మనమందరం మానవ హక్కులు, కరోనాపై పుకార్లు విలయతాండవం, అతిశయోక్తి సమాచారాలు ప్రపంచంలో ఈపాటికి చక్కర్లు కొట్టేవి. జనాలకు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలా సహాయ సహకారాలు, హెచ్చరికలు, ముందు జాగ్రత్త చర్యలు చేస్తున్నప్పటికి పరిస్థితి మాత్రం ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంది. కనీసం ఇప్పటికైనా భారతీయుల్లారా మేల్కొనండి యుద్ధం మన సరిహద్దుల్లో కాదు మన నట్టింట్లో మనకు మనం మన ఇంట్లో ఉంటూనే కాలు మీద కాలేసుకుని దేశ భద్రత, ఆర్థిక స్థితిగతులను శాసించవచ్చు. కేవలం మనం భారతీయులుగా చేయాల్సింది కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటించడం, అందరూ పాటించేలా చర్యలు తీసుకోవడం. కానీ అలా కాకుండా నా ఇష్టం
నా హక్కు నా పనులు అని ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తే నిర్లక్ష్యం ఖరీదు నీ, నా, మన, అలాగే మన దేశ పౌరుల ప్రాణాలు అందరికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది
తస్మాత్ జాగ్రత్త.

వాస్తవానికి చైనా ఇప్పటికి బయటకు చెబుతున్న లెక్కల ప్రకారం కరోనా మృతుల విషయంలో చైనా రెండో స్థానంలో వుంది. అక్కడి నుంచి కరోనా వైరస్ వ్యాపించిన దేశం ఇటలీ మాత్రం ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చేసింది ఇదంతా మీకు విడ్డురంగా అనిపించడం లేదా. అందుకే ప్రజలు కనీసం ఇప్పటికైనా తైవాన్, దక్షిణ కొరియా పౌరుల్లా బాధ్యతగా మెలుగుదాం.
మనం బాధ్యతలను నిర్వర్తించి హక్కుల కోసం ఎప్పటికి మన దేశంలో పోరాటం సాగిద్దాం. పదండి ముందుకు పదండి.
చేయి చేయి కలుపుదాం ఒకే మాట ఒకే బాటలో నడుద్దాం. మన దేశంలో చైనాలా కాకుండా మానవత్వాన్ని కాపడుదాం.
ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా నిలుద్దాం. ప్రాణం ఖరీదు విలువ కట్టలేనిది.

జై భారత్ జైజై భారత్.