డాక్టర్ల రక్షణకు YSR చట్టం అమలు డిమాండ్: ఎంపీ KVP

ప్రాణాంతకమైన కరోనా సోకిన వ్యక్తులకు ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందిపై దాడులు చేయడాన్ని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు KVP రామచంద్ర రావు ఖండించారు. వైద్య సిబ్బంది, ఆసుపత్రులపై దాడులకు వ్యతిరేకంగా దేశంలో తొలిసారిగా ఏపి చట్టం చేసింది.
2007లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి YS రాజశేఖర్ రెడ్డి చేసిన చట్టాన్ని వెంటనే అమలు చేయాలి.
ఏపి తర్వాత హర్యానా తదితర రాష్ట్రాలు అదే తరహాలు చట్టాలు చేశాయి. దాడులకు పాల్పడిన వారిని గుర్తించి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరుతున్నాను. ఇలాంటి ఆపత్కాల సమయంలో మనందరి క్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించే మార్గదర్శకాలను, విధించే ఆంక్షలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలి. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాల మేరకు, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సాధ్యమైనంతవరకు కష్టాలలో ఉన్న వారికి అండగా ఉండేందుకు, సాయం అందించేందుకు కృషి చేయాలి.
బయటి రాష్టాల నుంచి బతుకు తెరువు కోసం తెలుగు రాష్ట్రాలకు వలస వచ్చి, మౌలిక వసతుల కోసం ఇబ్బందులు పడుతున్నవారికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సాయం చేయాలి.
ఉభయ రాష్ట్రాలకు చెందిన పిసిసి లు రూపొందించిన కార్యాచరణ కు అనుగుణంగా రెండు రాష్ట్రాలలోని ప్రతి కార్యకర్త క్రమశిక్షణ గల సైనికుడిలా పనిచేయాలి. సామాజిక బాధ్యత, సేవా భావం గల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ అత్యవసర సమయంలో మరింత ద్విగుణీకృత ఉత్సాహంతో కష్టాలలో ఉన్న వారికి తోడ్పాటును అందిస్తారని, అండగా ఉంటారని ఆశిస్తున్నానన్నారు.