ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఎంపీ కేవీపి లేఖ

ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఎంపీ కేవీపి లేఖ

ఏపీ పునర్విభజన చట్టం-2014 హామీలను అమలు
ఖచ్చితంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఎంపీ కేవీపి లేఖ రాశారు. దేశంలోని రాష్ట్రాలతో సమానంగా ఆంధ్రప్రదేశ్ ఆర్ధికంగా అభివృద్ధి కోసం కేంద్రము సహాయం అందించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణతో పోలిస్తే ఏపీ ఆర్థికంగా వెనకబడిందని లేఖలో పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం పునర్విభజన చట్టం-2014 అమలు చేయడం విస్మరించరాదని ఏపీ సీఎం వైస్. జగన్మోహన్ రెడ్డికి కూడా ఎంపి కెవిపి లేఖ రాశారు. ప్రధాని మోడీ సాధారణ ఎన్నికల ప్రచారంలో ఏపీకి అన్యాయం అన్నారు కానీ రాజ్యాంగపరంగా ఏపీ కి రావాల్సిన నిధులు మాత్రం అందడం లేదు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీకి న్యాయం చేస్తామని ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
ఏడుకొండల స్వామి తిరుపతి వెంకన్న సాక్షిగా ఏపీకి న్యాయం చేస్తామన్నారు ఇప్పుడేమో నీతి ఆయోగ్ విభాగాన్ని అడ్డం పెట్టుకుని ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంపై ఆగ్రహించారు.


పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని అసలు
ఏ ఉద్దేశంతో చంద్రబాబు పోలవరం నిర్మాణం బాధ్యతలు చెప్పటారో అర్థం కాలేదన్నారు.దుగ్గరాజ పట్నం, పెట్రో కెమికల్ ప్రాజెక్ట్ , బుందేల్ఖండ్ తరహా ప్రత్యేక ప్యాకేజి ఎందుకు ఇవ్వడం లేదన్నారు. ఈ అంశాలను సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని రైల్వే జోన్ వలన రాష్టానికి వచ్చిన ప్రత్యేక ప్రయోజనం ఏమి లేదన్నారు. ఏపీ రాష్టానికి అన్యాయం జరగకుండా ఉండేదుకు కేంద్ర నుంచి వెంటనే వివిధ విభాగాల్లో రావల్సిన 27,571 కోట్లు తక్షణమే విడుదల చేయాలని ఇవాళ మీడియా సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు కోరారు.

ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఎంపీ కేవీపి లేఖ
పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.