గృహమే స్వర్గసీమ: ఎంపీ సంతోష్ పిలుపు

గృహమే స్వర్గసీమ: ఎంపీ సంతోష్ పిలుపు

రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ గృహమే కదా స్వర్గసీమ అనే విధానంతో ఇంటికే పరిమితమయ్యారు. భారతీయులు కరోనా వైరస్ కట్టడి చేయాలంటే ఖచ్చితంగా స్వీయ నియంత్రణ అవసరం బయటకు రావద్దండి అంటూ పిలుపు ఇచ్చారు. ఇంట్లోనే పిల్లలతో కలిసి క్రికెట్ ఆడుతూ ఆటవిడుపులో మునిగిపోయారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలు, హెచ్చరికలు, సూచనలు పాటించాలని నిర్లక్ష్యం వహిస్తే ఆ ఖరీదు ప్రాణాలంటూ అభిప్రాయబడ్డారు.

కల నిజమైంది. బిజీ బిజీ షెడ్యూల్ నుంచి ఇంట్లో అందరితో కలిసి మెలసి ఉగాది పండుగ జరువుకున్నాము. రోజంతా ఇంట్లోనే ఉంటూ కొద్దిసేపు మాత్రం పిల్లలతో ఆటవిడుపుగా పిల్లలతో సరదాగా గడిపాను. ఉగాది పర్వదినం ఇంట్లోనే ఉంటూ నిర్వహించుకోవడం సంతోషంగా
ఉంది. భారతీయులు అందరూ ఇంట్లోనే ఉండాలని Stay Home Saty Safe అంటూ పిలుపు నిచ్చారు.