కరోనాలో నిత్యాన్నదానం: ఎంపీ సంతోష్

తెలంగాణలోని బోయినిపల్లి మండలం కోదురుపాక గ్రామంలో 12వ రోజు నిత్యాన్నదానంను ఎంపీ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నారు. గ్రామంలోని స్థానిక పేదలు, వలస కూలీలు, దినసరి కూలీలకు ఈ నిత్యాన్నదానంపై సంతృప్తిగా భోజనం చేస్తూ కంటినిండా నిద్ర పోయే భరోసా కల్పిస్తుండటాన్ని హర్షిస్తున్నారు.

ఈ నిత్యాన్నదాన క్యాంప్ లాక్ డౌన్ పూర్తి అయ్యేవరకు భోజనాలు అందరికి అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ ఖచ్చితంగా ఇక్కడకు ఆహారం కిసం వచ్చే వ్యక్తులు ప్రతి ఒక్కరు విధిగా మస్కులు ధరించాలి, సామాజిక దూరం పాటించాలి, వ్యక్తిగత శుభ్రతతో స్వీయ నిర్బంధంలో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అన్నదాత సుఖీభవ అంటూ నిత్యాన్నదానం చేస్తుండటంపై ప్రజలందరూ
దీవిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కోదురుపాక గ్రామ శాఖ TRS అధ్యక్షుడు చిక్కల సుధాకర్ రావు, TRS నాకులు, చింతలపల్లి తిరుపతి రెడ్డి, ఒద్దెల మహేందర్, బొల్లావేని తిరుపతి, సందుల శ్రీనివాస్, కత్తెరపాక సుధాకర్, ఆకుల కర్ణకర్, సారంపెళ్లి రవి, కమల్, సిద్ధాంతి కళాధర్, గుండ్ల సాయబు రాజీరెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.