కాశ్మీర్ లోయలో ముజాహిదీన్ చీఫ్ రియాజ్ ఎన్ కౌంటర్

మనదేశ భద్రత దళాలు కాశ్మీర్ లోయలో ఉగ్రవాదులను ఉక్కుపాదంతో అణచి వేస్తున్నారు. ఓ వైవు దేశంలో కరోనా ప్రభావం కారణంగా తీవ్ర ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతుంటే సహాయ సహకారాలు అందిస్తూనే మరోవైపు రక్షణ బాధ్యతల్లో కూడా నిమగ్నమై దేశ సరిహద్దుల్లో కాపాలకాస్తున్నారు. బుధవారం హిమాలయ మంచు పార్వతాల్లో హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ రియాజ్ నాయకూ దక్షిణ కాశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌ చేసారని రక్షణ బలగాలు తెలిపాయి. ఈ కరుడుగట్టిన తీవ్రవాది మృతి చెందినట్లు అధికారికంగా దృవీకరించారు.