మై డ్రీమ్స్ కిడ్స్ వీడియో ఆవిష్కరణ

కరోనా హాలిడేస్ లో పిల్లల్లో సృజనాత్మకత పెంపొందేలా పెద్దలు ప్రోత్సహించాలని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. మై డ్రీమ్స్ కిడ్స్ తయారుచేసిన తెలుగు నేర్చుకుందాం వీడియో ని ఆయన ఈరోజు ఆవిష్కరించారు.

కరోనా భూతం విలయాన్ని చూసి పిల్లల చిన్ని మనసులు చలించాయి… తమవంతు ఏమైనా చేయాలని తపించాయి. అమితాబ్ జీ స్టే హోం వీడియో చూసిన తర్వాత వారికీ ఒక ఆలోచన వచ్చింది.. వెంటనే అమల్లో పెట్టేశారు.. వాళ్ల ఐడియా విన్న తర్వాత తల్లిదండ్రులే కాన్సెప్ట్ రాసి, కెమెరామెన్లుగా మారి ఒక వీడియో ఫిలిం తీశారు. హైదరాబాద్, బెంగుళూరు, విశాఖ, విజయవాడ ఇలా ఒక్కొక్కరూ ఒక్కో చోట ఉంటారు. కానీ ఒకేచోట ఉన్నట్టు అద్భుతంగా నటించేశారు. కరోనా ఎఫెక్ట్ తో వచ్చిన హాలిడేస్ నిసద్వినియోగం చేసుకొని మాతృభాషని నేర్చుకుందాం అంటూ ఇచ్చిన సందేశం మనసుల్ని తాకుతోంది… కరోనాపై పోరుకి మీకు తోచిన సాయంతో ప్రభుత్వానికి బాసటగా నిలవండి అని పిలుపునిచ్చారు… ఇంతకీ ఇందులో నటించిన వారంతా పదేళ్లలోపు పిల్లలే కావడం విశేషం… ఆ వీడియోని చూసి మీరూ వాళ్లని ప్రేమతో ఆశీర్వదించండి…
#stayhome #stayhappy #mydreams